Sigguvada kamta neevu sittameṟumgudu nenu

సిగ్గువడ కంత నీవు చిత్తమెఱుఁగుదు నేను
Language

(॥పల్లవి॥)
సిగ్గువడ కంత నీవు చిత్తమెఱుఁగుదు నేను
యెగ్గు లెవ్వరెంచినా నియ్యకోలు నేను

(॥సిగ్గు॥)
కందువ నావాఁడవై కలిగి నీవుండఁగాను
యెందరినిఁ దెచ్చుకొన్నా నేమాయను
అందుకుఁగా దూరేరు అతివ లిందరు నిన్ను
విందువలె నీమాఁట విననోప నేను

(॥సిగ్గు॥)
యీడ నా చెప్పినట్టు ఇట్టె నీవు సేయఁగాను
యేడనుండి వచ్చినాను యేమాయను
వాడవారిందరు నిన్ను వడి నిందుకే నవ్వేరు
చూడఁ జాల నిది నేఁడు సోవలుగా నేను

(॥సిగ్గు॥)
ఆయమంటి నీవు నా కాఁగిటిలో నుండఁగాను
యే యింతిచే మొక్కించినా నేమాయను
యీయెడ నన్నుఁ గూడితివి చెలులెల్లా మెచ్చిరి
పాయలేను శ్రీ వేంకటపతి నిన్ను నేను

(||pallavi||)
sigguvaḍa kaṁta nīvu sittamĕṟum̐gudu nenu
yĕggu lĕvvarĕṁchinā niyyagolu nenu

(||siggu||)
kaṁduva nāvām̐ḍavai kaligi nīvuṁḍam̐gānu
yĕṁdarinim̐ dĕchchugŏnnā nemāyanu
aṁdugum̐gā dūreru adiva liṁdaru ninnu
viṁduvalĕ nīmām̐ṭa vinanoba nenu

(||siggu||)
yīḍa nā sĕppinaṭṭu iṭṭĕ nīvu seyam̐gānu
yeḍanuṁḍi vachchinānu yemāyanu
vāḍavāriṁdaru ninnu vaḍi niṁduge navveru
sūḍam̐ jāla nidi nem̐ḍu sovalugā nenu

(||siggu||)
āyamaṁṭi nīvu nā kām̐giḍilo nuṁḍam̐gānu
ye yiṁtise mŏkkiṁchinā nemāyanu
yīyĕḍa nannum̐ gūḍidivi sĕlulĕllā mĕchchiri
pāyalenu śhrī veṁkaḍabadi ninnu nenu