సిగ్గువాసి కూటికే చీరగట్టినవారము
(॥పల్లవి॥)
సిగ్గువాసి కూటికే చీరగట్టినవారము
యెగ్గులేక తనవలె నెదుట నుండేదా
(॥సిగ్గు॥)
నెట్టన మాయింటిలోన నిద్దిరించఁగా జూచి
యిట్టే యలిగితినంటానేల పోరీనే
అట్టె యొక్క వేళ మాకు నలపు సొలపు లేదా
పట్టలేక తనవలె పనిలేదా మాకును
(॥సిగ్గు॥)
తగిలి జూజమాడుతా తలవంచుకుండఁగాను
నగవంటానేల పోరీ నాతో నేఁడు
మగుదలమైనమాకు ముసిమి ముచ్చట లేదా
మొగమెత్తి తనవలె మొక్కులు మొక్కేదా
(॥సిగ్గు॥)
అలసెనంటాఁ దనకు ఆలవట్ల మిడఁగాను
చలిగొనినంటా నేల సారెఁ బోరీనే
యెలమి శ్రీవేంకటేశుఁ డిటు గూడఁ జెల్లుఁగాక
వలెనంటా మాకుమాకే వద్దికి రాఁదగవా
(||pallavi||)
sigguvāsi kūḍige sīragaṭṭinavāramu
yĕggulega tanavalĕ nĕduḍa nuṁḍedā
(||siggu||)
nĕṭṭana māyiṁṭilona niddiriṁcham̐gā jūsi
yiṭṭe yaligidinaṁṭānela porīne
aṭṭĕ yŏkka veḽa māgu nalabu sŏlabu ledā
paṭṭalega tanavalĕ paniledā māgunu
(||siggu||)
tagili jūjamāḍudā talavaṁchuguṁḍam̐gānu
nagavaṁṭānela porī nādo nem̐ḍu
magudalamainamāgu musimi muchchaḍa ledā
mŏgamĕtti tanavalĕ mŏkkulu mŏkkedā
(||siggu||)
alasĕnaṁṭām̐ danagu ālavaṭla miḍam̐gānu
saligŏninaṁṭā nela sārĕm̐ borīne
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiḍu gūḍam̐ jĕllum̐gāga
valĕnaṁṭā māgumāge vaddigi rām̐dagavā