సిగ్గున నూరకుండితే సేసినవాఁడవే నీవు
(॥పల్లవి॥)
సిగ్గున నూరకుండితే సేసినవాఁడవే నీవు
బెగ్గిలక సాకిరిచెప్పే నేను నీకును
(॥సిగ్గు॥)
కలలోన వేరొకతె కాఁగిటిలో నిన్నుఁగని
వెలఁది మేల్కని నీతో వెంగెమాడీని
యెలమిఁ దెలియలేక యేలపెట్టుకొనో వాన
కలికియు నీవుఁ దారుకాణించుకోరాదా
(॥సిగ్గు॥)
వొక్కతెతో రతి నీకు నూహించి తానే భ్రమసె
చక్కనినీమోము చూచి సాదించీని
చెక్కుచేతితో నేల చింతించే విందుకుగా
గక్కన నిద్దరుఁ దారుకాణించుకోరాదా
(॥సిగ్గు॥)
పొరుగాపె పొందులు పోలికలు చూచుకొని
సరికిబేసికి నిన్ను జంకించీని
అరిది శ్రీవేంకటేశ అలమేలుమంగ యాకె
కరుణించి నిన్నుఁ దారుకాణించుకోరాదా
(||pallavi||)
sigguna nūraguṁḍide sesinavām̐ḍave nīvu
bĕggilaga sāgirisĕppe nenu nīgunu
(||siggu||)
kalalona verŏgadĕ kām̐giḍilo ninnum̐gani
vĕlam̐di melgani nīdo vĕṁgĕmāḍīni
yĕlamim̐ dĕliyalega yelabĕṭṭugŏno vāna
kaligiyu nīvum̐ dārugāṇiṁchugorādā
(||siggu||)
vŏkkadĕdo radi nīgu nūhiṁchi tāne bhramasĕ
sakkaninīmomu sūsi sādiṁchīni
sĕkkusedido nela siṁtiṁche viṁdugugā
gakkana niddarum̐ dārugāṇiṁchugorādā
(||siggu||)
pŏrugābĕ pŏṁdulu poligalu sūsugŏni
sarigibesigi ninnu jaṁkiṁchīni
aridi śhrīveṁkaḍeśha alamelumaṁga yāgĕ
karuṇiṁchi ninnum̐ dārugāṇiṁchugorādā