Sigguna munimgenu simtalam boralenu

సిగ్గున మునిఁగెను చింతలఁ బొరలెను
Language

(॥పల్లవి॥)
సిగ్గున మునిఁగెను చింతలఁ బొరలెను
యెగ్గులెంతురా యిఁకనేలే

(॥॥)
శిరసును వంచెను సెలవుల నవ్వెను
మరిగెనుఁ బతి నీమాఁటలకే
నిరతితో నలసెను నిట్టూర్పులు నించెను
యెరపరికములఁ జల మిఁకనేలే

(॥॥)
నిన్నిటు చూచెను నేలలు వ్రాసెను
సన్నల నీలో సణఁగులకే
యిన్నిటి కొడఁబడె నిటు చేయివేసెను
యెన్నిక కొసరులు యికఁనేలే

(॥॥)
పంతము నించెను పానుపు చేరెను
కొంత గొంత నీకూటమికే
యింతట శ్రీవేంకటేశ్వరుఁ గలసితి-
వెంతని మెచ్చే వికఁనేలే

(||pallavi||)
sigguna munim̐gĕnu siṁtalam̐ bŏralĕnu
yĕggulĕṁturā yim̐kanele

(||||)
śhirasunu vaṁchĕnu sĕlavula navvĕnu
marigĕnum̐ badi nīmām̐ṭalage
niradido nalasĕnu niṭṭūrbulu niṁchĕnu
yĕrabarigamulam̐ jala mim̐kanele

(||||)
ninniḍu sūsĕnu nelalu vrāsĕnu
sannala nīlo saṇam̐gulage
yinniḍi kŏḍam̐baḍĕ niḍu seyivesĕnu
yĕnniga kŏsarulu yigam̐nele

(||||)
paṁtamu niṁchĕnu pānubu serĕnu
kŏṁta gŏṁta nīgūḍamige
yiṁtaḍa śhrīveṁkaḍeśhvarum̐ galasidi-
vĕṁtani mĕchche vigam̐nele