(॥పల్లవి॥)
సిగ్గుమాలిన జీవుఁడు దా-
మొగ్గినచోటనే ములుగుఁ గాక
(॥సిగ్గు॥)
ఆలు బిడ్డలకునై యెల్లకాలము
పాలుమాలక పాటువడి
తీలుగా వచ్చితే దేవుని దూరును
యేలో నాఁడే యిది యెఱుఁగఁడా
(॥సిగ్గు॥)
కిమ్ముల విషయ కింకరుఁడై తా
నమ్ముడు వోయె నందులకే
కమ్ముకోవచ్చిన కర్మము దూరును
యిమ్ముల నాఁడిది యెఱుఁగఁడా
(॥సిగ్గు॥)
బ్రతికి యెన్పాళ్ళు భ్రమసి దేహమె
మితి లేక వోమి మిఁదటా
గతి యని శ్రీ వేంకటపతి జేరు
హితవని నాఁడె యెఱుఁగఁడా
(||pallavi||)
siggumālina jīvum̐ḍu dā-
mŏgginasoḍane mulugum̐ gāga
(||siggu||)
ālu biḍḍalagunai yĕllagālamu
pālumālaga pāḍuvaḍi
tīlugā vachchide devuni dūrunu
yelo nām̐ḍe yidi yĕṟum̐gam̐ḍā
(||siggu||)
kimmula viṣhaya kiṁkarum̐ḍai tā
nammuḍu voyĕ naṁdulage
kammugovachchina karmamu dūrunu
yimmula nām̐ḍidi yĕṟum̐gam̐ḍā
(||siggu||)
bradigi yĕnpāḽḽu bhramasi dehamĕ
midi lega vomi mim̐daḍā
gadi yani śhrī veṁkaḍabadi jeru
hidavani nām̐ḍĕ yĕṟum̐gam̐ḍā