Siggulu vaduduvu ne mivi seppina ninnaallagaide

సిగ్గులు వడుదువు నే మివి చెప్పిన నిన్నాళ్లకైతే
Language

(॥పల్లవి॥)
సిగ్గులు వడుదువు నే మివి చెప్పిన నిన్నాళ్లకైతే
అగ్గలమై కలిగెఁగా అన్నియు నీయంతనే

(॥సిగ్గు॥)
తురుమునరాలెడి పువ్వుల తొరిగేటి సెలవుల నవ్వుల
అరవిరియై వచ్చే విదె ఆతనికడనుండి
గరిమల నీయందే యివి కంటిమిగా నేఁడైనా
సురతాంతపుసింగారము చూపేవా మాకు

(॥సిగ్గు॥)
చెక్కులచెమటలజారుల చింద్రికమోపుల తీరుల
అక్కరదేరుచు వచ్చే వాతనికడనుండి
చక్కని నీయంద మరఁగ సంతస మైతిమిగా యిటు
మిక్కిలి మరు సామ్రాజ్యము మెఱసేవా యిపుడు

(॥సిగ్గు॥)
రతులనే చొక్కిన మరపుల రచనల సరసపు టొరపుల
అతివేడుకతో వచ్చే వాతని కడనుండి
అతఁడదే శ్రీవేంకటేశుఁడు అటు నినుఁ గూ డిటు వచ్చెను
గతులను మామీఁదట మీకరుణలు చల్లేరా

(||pallavi||)
siggulu vaḍuduvu ne mivi sĕppina ninnāḽlagaide
aggalamai kaligĕm̐gā anniyu nīyaṁtane

(||siggu||)
turumunarālĕḍi puvvula tŏrigeḍi sĕlavula navvula
araviriyai vachche vidĕ ādanigaḍanuṁḍi
garimala nīyaṁde yivi kaṁṭimigā nem̐ḍainā
suradāṁtabusiṁgāramu sūbevā māgu

(||siggu||)
sĕkkulasĕmaḍalajārula siṁdrigamobula tīrula
akkaraderusu vachche vādanigaḍanuṁḍi
sakkani nīyaṁda maram̐ga saṁtasa maidimigā yiḍu
mikkili maru sāmrājyamu mĕṟasevā yibuḍu

(||siggu||)
radulane sŏkkina marabula rasanala sarasabu ṭŏrabula
adiveḍugado vachche vādani kaḍanuṁḍi
adam̐ḍade śhrīveṁkaḍeśhum̐ḍu aḍu ninum̐ gū ḍiḍu vachchĕnu
gadulanu māmīm̐daḍa mīgaruṇalu sallerā