Siggulu vadanemtigi semdi naa mogamu soosi

సిగ్గులు వడనేఁటికి చెంది నా మొగము చూచి
Language

(॥పల్లవి॥)
సిగ్గులు వడనేఁటికి చెంది నా మొగము చూచి
వొగ్గి నీవు లాలించఁగా నొద్దనేనా నేను

(॥సిగ్గు॥)
సరిఁ జెమటలుగార సతి నీకడకు వచ్చె
సురటి విసరరాదా చోటియ్యరాదా
దురదురఁ బారితేఁగా తురుమెల్లానిదె జారె
గరిమల నిట్టే కీలుగంటు వేయరాదా

(॥సిగ్గు॥)
కడుదగ దొట్టుకొంటా కానుక చేతి కిచ్చీని
వెడ దప్పి దేర్చరాదా వీడె మీరాదా
జడిసి నీకు మొక్కఁగా చన్నులు బయటఁ బడె
కడగి నీపచ్చడము గప్పి పెట్టరాదా

(॥సిగ్గు॥)
అలపులు దేరఁగాను అట్టె ప్రియములు చెప్పె
లలి నూఁకొనఁగరాదా లాలించరాదా
అలరి శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
కలసితి వాపె నింకాఁ గైకొనరాదా

(||pallavi||)
siggulu vaḍanem̐ṭigi sĕṁdi nā mŏgamu sūsi
vŏggi nīvu lāliṁcham̐gā nŏddanenā nenu

(||siggu||)
sarim̐ jĕmaḍalugāra sadi nīgaḍagu vachchĕ
suraḍi visararādā soḍiyyarādā
duraduram̐ bāridem̐gā turumĕllānidĕ jārĕ
garimala niṭṭe kīlugaṁṭu veyarādā

(||siggu||)
kaḍudaga dŏṭṭugŏṁṭā kānuga sedi kichchīni
vĕḍa dappi dersarādā vīḍĕ mīrādā
jaḍisi nīgu mŏkkam̐gā sannulu bayaḍam̐ baḍĕ
kaḍagi nībachchaḍamu gappi pĕṭṭarādā

(||siggu||)
alabulu deram̐gānu aṭṭĕ priyamulu sĕppĕ
lali nūm̐kŏnam̐garādā lāliṁcharādā
alari śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
kalasidi vābĕ niṁkām̐ gaigŏnarādā