Siggulu simgaaraalu sellune neegu

సిగ్గులు సింగారాలు చెల్లునే నీకు
Language

(॥పల్లవి॥)
సిగ్గులు సింగారాలు చెల్లునే నీకు
నిగ్గులు నీడలు మాతో నెరపఁగఁ జెల్లునే

(॥॥)
వుక్కున నీరమణుఁడు వొత్తిన రేకలు దాఁచ
చెక్కుమీఁదాచేయి నీకు చెల్లునే నేఁడు
పెక్కుటధర పానవు పెదవి చొప్పులు మాప
ముక్కుమీఁది వేలు నేఁడు మోప నీకుఁ జెల్లునే

(॥॥)
పొంది నీమేనిమీఁది పులకలన్నియు దాఁచ
చెందినపయ్యద కప్పు చెల్లునే నీకు
కందువ నీసమరతి కళలు మొరఁగుటకు
చిందేముసిముసినవ్వు చెల్లునే నీకు

(॥॥)
అంగపు కాఁగిటిలోఅలపు లన్నియు దాఁచ
సింగారపు తోఁట కేఁగఁజెల్లునే నీకు
రంగగు శ్రీ వేంకటాద్రిరాయఁడు నిన్నుఁగూడె
ముంగురులు జారినవి ముడువఁగఁజెల్లునే

(||pallavi||)
siggulu siṁgārālu sĕllune nīgu
niggulu nīḍalu mādo nĕrabam̐gam̐ jĕllune

(||||)
vukkuna nīramaṇum̐ḍu vŏttina regalu dām̐sa
sĕkkumīm̐dāseyi nīgu sĕllune nem̐ḍu
pĕkkuḍadhara pānavu pĕdavi sŏppulu māba
mukkumīm̐di velu nem̐ḍu moba nīgum̐ jĕllune

(||||)
pŏṁdi nīmenimīm̐di pulagalanniyu dām̐sa
sĕṁdinabayyada kappu sĕllune nīgu
kaṁduva nīsamaradi kaḽalu mŏram̐guḍagu
siṁdemusimusinavvu sĕllune nīgu

(||||)
aṁgabu kām̐giḍiloalabu lanniyu dām̐sa
siṁgārabu tom̐ṭa kem̐gam̐jĕllune nīgu
raṁgagu śhrī veṁkaḍādrirāyam̐ḍu ninnum̐gūḍĕ
muṁgurulu jārinavi muḍuvam̐gam̐jĕllune