Siggulu padaguvayya sekkuseyi deeyavayyaa

సిగ్గులు పడకువయ్య చెక్కుచెయి దీయవయ్యా
Language

(॥పల్లవి॥)
సిగ్గులు పడకువయ్య చెక్కుచెయి దీయవయ్యా
నిగ్గుల నవ్వితిమి నీ జాడలెరఁగక

(॥సిగ్గులు॥)
వేడుకకాఁడవు నీవు వెలఁదులఁ గంటేను
కూడుకవత్తువుగాని కొట్లాడవు
వోడవేపనికినైనా వోపికగలవాఁడవు
ఆడుకొంటిమిందాఁక నీ ఆయాలెరఁగక

(॥సిగ్గులు॥)
పాయపువాఁడవు నీవు పడఁతులేమి చేసిన
చాయల మెత్తువుగాని చలపోరవు
యీయకొందువేమైనా నింటివాఁడవందరికి
చేయివట్టి తీసితిమి చిత్తమిదెరఁగక

(॥సిగ్గులు॥)
చెల్లుబడివాఁడవు శ్రీ వెంకటేశ యింతుల
పల్లదాలకు లోఁగాని పాయవెన్నఁడు
యిల్లిదె మమ్మేలితివి యిన్నిట దయానిధివి
వల్లెవేసితిమి నీవరుసలెరఁగక

(||pallavi||)
siggulu paḍaguvayya sĕkkusĕyi dīyavayyā
niggula navvidimi nī jāḍalĕram̐gaga

(||siggulu||)
veḍugagām̐ḍavu nīvu vĕlam̐dulam̐ gaṁṭenu
kūḍugavattuvugāni kŏṭlāḍavu
voḍavebaniginainā vobigagalavām̐ḍavu
āḍugŏṁṭimiṁdām̐ka nī āyālĕram̐gaga

(||siggulu||)
pāyabuvām̐ḍavu nīvu paḍam̐tulemi sesina
sāyala mĕttuvugāni salaboravu
yīyagŏṁduvemainā niṁṭivām̐ḍavaṁdarigi
seyivaṭṭi tīsidimi sittamidĕram̐gaga

(||siggulu||)
sĕllubaḍivām̐ḍavu śhrī vĕṁkaḍeśha yiṁtula
palladālagu lom̐gāni pāyavĕnnam̐ḍu
yillidĕ mammelidivi yinniḍa dayānidhivi
vallĕvesidimi nīvarusalĕram̐gaga