Siggugala yaamtadaidem jera vachchunaa

సిగ్గుగల యాఁటదైతేఁ జేర వచ్చునా
Language

(॥పల్లవి॥)
సిగ్గుగల యాఁటదైతేఁ జేర వచ్చునా
వొగ్గి నేఁ గా నీతో నొక్కటైతిఁ గాకా

(॥సిగ్గు॥)
వొంటి వేగించఁగా లేక వొద్దికి వచ్చితిఁ గాక
యింటికివచ్చిన మోహ మితవయ్యీనా
మంట దేర నీతోను మాటల నాడేఁ గాక
కంటకపు నీతో పొందు కానిదే కాదా

(॥సిగ్గు॥)
చిత్తము నిలుపలేక సెలవి నవ్వితిఁ గాక
బత్తి సేయ నీమీఁద పాపము గాదా
తత్తర మాపఁగలేక తప్పక చూచితిఁ గాక
హత్తి నీతో మొగమోట మారడి కాదా

(॥సిగ్గు॥)
పొందు మరిగితిఁ గాన పొత్తుకు వచ్చితిఁ గాక
చెంది వేగిరించ నీతోఁ జెల్లునా నాకు
కందువఁ గూడితివి చాఁగలమఱ్ఱి చెన్నుఁడవై
అందపు శ్రీవేంకటేశ అరుదా నాకు

(||pallavi||)
siggugala yām̐ṭadaidem̐ jera vachchunā
vŏggi nem̐ gā nīdo nŏkkaḍaidim̐ gāgā

(||siggu||)
vŏṁṭi vegiṁcham̐gā lega vŏddigi vachchidim̐ gāga
yiṁṭigivachchina moha midavayyīnā
maṁṭa dera nīdonu māḍala nāḍem̐ gāga
kaṁṭagabu nīdo pŏṁdu kānide kādā

(||siggu||)
sittamu nilubalega sĕlavi navvidim̐ gāga
batti seya nīmīm̐da pābamu gādā
tattara mābam̐galega tappaga sūsidim̐ gāga
hatti nīdo mŏgamoḍa māraḍi kādā

(||siggu||)
pŏṁdu marigidim̐ gāna pŏttugu vachchidim̐ gāga
sĕṁdi vegiriṁcha nīdom̐ jĕllunā nāgu
kaṁduvam̐ gūḍidivi sām̐galamaṭri sĕnnum̐ḍavai
aṁdabu śhrīveṁkaḍeśha arudā nāgu