Sigguga laamtadaanigi seppimchugo nimta yela

సిగ్గుగ లాఁటదానికి చెప్పించుకో నింత యేల
Language

(॥పల్లవి॥)
సిగ్గుగ లాఁటదానికి చెప్పించుకో నింత యేల
దగ్గరి వుండుటే చాలు తడవకు మమ్మును

(॥సిగ్గుగ లా॥)
వొలిసీ నొల్లని నిన్ను వొడివటి తీయుకంటే
అలిగి నేఁ బవళించు టదియే మేలు
పిలువకుండఁగ నీవు పెనఁగి పైఁ బడుకంటే
తల వంచుకొని వుండే తడవకు మమ్మును

(॥సిగ్గుగ లా॥)
కడు రాజసపు నీతో కలకల నవ్వుకంటే
చిడుముడిఁ జిన్నఁ బొయ్యే చింత మేలు
జడిసి వుండిన నీతో చనవు చెప్పుటకంటే
తడతాఁకులఁ బొరలే తడవకు మమ్మును

(॥సిగ్గుగ లా॥)
కపటాలు సేసే నిన్ను కాఁగిలించుకొనుకంటే
నెపముతో నూరకుండే నీటే మేలు
యిపుడె శ్రీవెంకటేశ యేకమై నన్నుఁ గూడితి
తపము ఫలించె నిఁకఁ దడవకు మమ్మును

(||pallavi||)
sigguga lām̐ṭadānigi sĕppiṁchugo niṁta yela
daggari vuṁḍuḍe sālu taḍavagu mammunu

(||sigguga lā||)
vŏlisī nŏllani ninnu vŏḍivaḍi tīyugaṁṭe
aligi nem̐ bavaḽiṁchu ṭadiye melu
piluvaguṁḍam̐ga nīvu pĕnam̐gi paim̐ baḍugaṁṭe
tala vaṁchugŏni vuṁḍe taḍavagu mammunu

(||sigguga lā||)
kaḍu rājasabu nīdo kalagala navvugaṁṭe
siḍumuḍim̐ jinnam̐ bŏyye siṁta melu
jaḍisi vuṁḍina nīdo sanavu sĕppuḍagaṁṭe
taḍadām̐kulam̐ bŏrale taḍavagu mammunu

(||sigguga lā||)
kabaḍālu sese ninnu kām̐giliṁchugŏnugaṁṭe
nĕbamudo nūraguṁḍe nīḍe melu
yibuḍĕ śhrīvĕṁkaḍeśha yegamai nannum̐ gūḍidi
tabamu phaliṁchĕ nim̐kam̐ daḍavagu mammunu