సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాఁడు
(॥పల్లవి॥)
సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాఁడు
బిగ్గెఁ గాఁగిలించుకొని పెనఁగినఁగాక
(॥॥)
పెదవిపై మాటలు బ్రియములు వుట్టునా
వుదుటుగుబ్బలఁ బతి నూఁదినఁగాక
సదరపుఁ జెనకుల చవులు వుట్టీనా
సదమదముగ రతి సలిపినఁగాక
(॥॥)
సెలపుల నవ్వితేనే చిత్తము గరఁగునా
సొలయుచు మోవిచవి చూపినఁగాక
ములువాఁడిచూపుల మోములు వుట్టునా
లలిఁ దమ్ములముపొత్తు గలసినగాక
(॥॥)
సరసములాడితేనే సంగతా లెనయునా
సరుసఁ దనువు లొక్కజంటైన గాక
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
పరపుపైనే చాలునా వురమెక్కినఁగాక
(||pallavi||)
siggudoḍa gŏṁkidenu sikkunā magavām̐ḍu
biggĕm̐ gām̐giliṁchugŏni pĕnam̐ginam̐gāga
(||||)
pĕdavibai māḍalu briyamulu vuṭṭunā
vuduḍugubbalam̐ badi nūm̐dinam̐gāga
sadarabum̐ jĕnagula savulu vuṭṭīnā
sadamadamuga radi salibinam̐gāga
(||||)
sĕlabula navvidene sittamu garam̐gunā
sŏlayusu movisavi sūbinam̐gāga
muluvām̐ḍisūbula momulu vuṭṭunā
lalim̐ dammulamubŏttu galasinagāga
(||||)
sarasamulāḍidene saṁgadā lĕnayunā
sarusam̐ danuvu lŏkkajaṁṭaina gāga
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
parabubaine sālunā vuramĕkkinam̐gāga