Siggudo nunna daana namtaa seri yaalaanadichcheve

సిగ్గుతో నున్న దాన నంటా చేరి యాలానతిచ్చేవే
Language

(॥పల్లవి॥)
సిగ్గుతో నున్న దాన నంటా చేరి యాలానతిచ్చేవే
వొగ్గి గర్వమేలన్ని వున్నదానఁ గాకా

(॥సిగ్గుతో॥)
చనవుగలదంటాను సరిఁ బెనఁగులాడేదా
తనుఁ గూడి మెప్పించుకోఁ దగుఁ గాక
మన సెఱుఁగుదు నంటా మర్మము లెత్తి నవ్వేదా
వినయాన నే రతికి వేఁడుకొంట గాకా

(॥సిగ్గుతో॥)
తా నన్ను మన్నించే నంటా తమకించి కొసరేదా
పూని తనకే వేడుక వుట్టింతుఁ గాక
కానిమ్మని వినీ నంటా కన్నదెల్లాఁ జెప్పేదా
మోనానఁ గొలువు సేసి మొనయుట గాక

(॥సిగ్గుతో॥)
నా కెంత నేరిపె నంటా నటనలు చూపేదా
జోకగాఁ దనకౌఁగిటఁ జొక్కింతుఁ గాక
యీకడ శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
చేకొనేవు మే లెల్లాఁ జింతింతుఁ గాకా

(||pallavi||)
siggudo nunna dāna naṁṭā seri yālānadichcheve
vŏggi garvamelanni vunnadānam̐ gāgā

(||siggudo||)
sanavugaladaṁṭānu sarim̐ bĕnam̐gulāḍedā
tanum̐ gūḍi mĕppiṁchugom̐ dagum̐ gāga
mana sĕṟum̐gudu naṁṭā marmamu lĕtti navvedā
vinayāna ne radigi vem̐ḍugŏṁṭa gāgā

(||siggudo||)
tā nannu manniṁche naṁṭā tamagiṁchi kŏsaredā
pūni tanage veḍuga vuṭṭiṁtum̐ gāga
kānimmani vinī naṁṭā kannadĕllām̐ jĕppedā
monānam̐ gŏluvu sesi mŏnayuḍa gāga

(||siggudo||)
nā kĕṁta neribĕ naṁṭā naḍanalu sūbedā
jogagām̐ danagaum̐giḍam̐ jŏkkiṁtum̐ gāga
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
segŏnevu me lĕllām̐ jiṁtiṁtum̐ gāgā