సిగ్గుపడితేఁ బోదు చెప్పేము నీకుఁ బ్రియము
(॥పల్లవి॥)
సిగ్గుపడితేఁ బోదు చెప్పేము నీకుఁ బ్రియము
తగ్గక నీమాట జవదాఁటకున్నాఁ డతఁడు
(॥॥)
మన్నించి నన్ను నిట్టె మచ్చికతో నేలుమని
విన్నవించవమ్మా విభునికిని
పన్ని ఇన్నిటా నీవు పట్టపుదేవులవు
కన్నెరో నీయప్పణకుఁ గాచుకున్నాఁ డతఁడు
(॥॥)
దట్టముగా నేఁడు మమ్ము దయతో రక్షించుమని
కట్టడ సేయవమ్మా కాంతునికి
అట్టేనీవు మొదల మోహపుఁబెండ్లికూఁతురవు
యెట్టైనా నీ పంపుసేయ నెంచుకున్నాఁ డతఁడు
(॥॥)
చేకొంటి వతని నీవు చేరి నన్నుఁ గూడుమని
కై కొలుపవమ్మా శ్రీవేంకటపతికి
నీకరుణవారము నీ వేలికసానివి
యీకడ నాయింటిలో నీయింపు చూపీ నతఁడు
(||pallavi||)
siggubaḍidem̐ bodu sĕppemu nīgum̐ briyamu
taggaga nīmāḍa javadām̐ṭagunnām̐ ḍadam̐ḍu
(||||)
manniṁchi nannu niṭṭĕ machchigado nelumani
vinnaviṁchavammā vibhunigini
panni inniḍā nīvu paṭṭabudevulavu
kannĕro nīyappaṇagum̐ gāsugunnām̐ ḍadam̐ḍu
(||||)
daṭṭamugā nem̐ḍu mammu dayado rakṣhiṁchumani
kaṭṭaḍa seyavammā kāṁtunigi
aṭṭenīvu mŏdala mohabum̐bĕṁḍligūm̐turavu
yĕṭṭainā nī paṁpuseya nĕṁchugunnām̐ ḍadam̐ḍu
(||||)
segŏṁṭi vadani nīvu seri nannum̐ gūḍumani
kai kŏlubavammā śhrīveṁkaḍabadigi
nīgaruṇavāramu nī veligasānivi
yīgaḍa nāyiṁṭilo nīyiṁpu sūbī nadam̐ḍu