Siggubadi neevu naadom jeppa jaala vimte kaaga

సిగ్గుపడి నీవు నాతోఁ జెప్ప జాల వింతే కాక
Language

(॥పల్లవి॥)
సిగ్గుపడి నీవు నాతోఁ జెప్ప జాల వింతే కాక
కగ్గిన నీ విరహము కాన రాదా నాకు

(॥సిగ్గువడి॥)
చెక్కుమీఁది చేయే చెప్పీఁ జిత్తములోపలిచింత
యిక్కడాఁ బతిపై మోహ మేల దాఁచేవే
లక్కవలెఁ గరఁ గొకలాగుల మాట లాడేవు
నెక్కొన్న విభావములు నే నెరఁగనా

(॥సిగ్గువడి॥)
కన్నులచూపులె చెప్పీ గాయముతో తమకము
యెన్నికలు నీవు నాతో నేల దాఁచేవే
పన్ని చెమరించుకొంటా పైపై బొంకేవు నాతో
వెన్నెల నీసుద్దు లెల్ల వినకున్నదాననా

(॥సిగ్గువడి॥)
నెలవినవ్వులె చెప్పీ శ్రీవెంకటేశునిపొందు
యెలమి నింకా నాతో నేల దాఁచేవే
వెలయ నాతఁడె నిన్ను వెల్లవిరిగాఁ గూడె
నిలువు నూరూఁ బండె నీ కెలె వెరపూ

(||pallavi||)
siggubaḍi nīvu nādom̐ jĕppa jāla viṁte kāga
kaggina nī virahamu kāna rādā nāgu

(||sigguvaḍi||)
sĕkkumīm̐di seye sĕppīm̐ jittamulobalisiṁta
yikkaḍām̐ badibai moha mela dām̐seve
lakkavalĕm̐ garam̐ gŏgalāgula māḍa lāḍevu
nĕkkŏnna vibhāvamulu ne nĕram̐ganā

(||sigguvaḍi||)
kannulasūbulĕ sĕppī gāyamudo tamagamu
yĕnnigalu nīvu nādo nela dām̐seve
panni sĕmariṁchugŏṁṭā paibai bŏṁkevu nādo
vĕnnĕla nīsuddu lĕlla vinagunnadānanā

(||sigguvaḍi||)
nĕlavinavvulĕ sĕppī śhrīvĕṁkaḍeśhunibŏṁdu
yĕlami niṁkā nādo nela dām̐seve
vĕlaya nādam̐ḍĕ ninnu vĕllavirigām̐ gūḍĕ
niluvu nūrūm̐ baṁḍĕ nī kĕlĕ vĕrabū