Siggu vada kemti pani sese nenu

సిగ్గు వడ కేఁటి పని సేసే నేను
Language

(॥పల్లవి॥)
సిగ్గు వడ కేఁటి పని సేసే నేను
వెగ్గళించఁ దగునా వెట్టి నింతే కాకా

(॥సిగ్గు॥)
యేడకో నీ వేగఁగాను యింటికి రమ్మనుచును
కోడెకాఁడ యెఱుఁగక కొసరే నేను
గోడమీఁది సున్నముల గోర నొలువఁగాఁ బోతే
వీడేనకు నను వవునా వెర్రి నింతేకాకా

(॥సిగ్గు॥)
అదె నీ చక్కదనాన కాసపడి మోహించి
పదరుచు నీ కొంగుపట్టి నేను
కదిసి చెఱకు పోలికకు వెదురు దింటేను
వెదురు దీపౌనా వెర్రి నింతే కాకా

(॥సిగ్గు॥)
చిత్తము దెలియ లేక శ్రీవేంకటేశుఁడ నిన్ను
కొత్తరతు లెల్లా రేఁచి కూడితి నిన్ను
బత్తిగల నీయందు బలిమివై నా వలపు
విత్తితేఁ బొల్లవొయ్యీనా వెర్రి నింతే కాకా

(||pallavi||)
siggu vaḍa kem̐ṭi pani sese nenu
vĕggaḽiṁcham̐ dagunā vĕṭṭi niṁte kāgā

(||siggu||)
yeḍago nī vegam̐gānu yiṁṭigi rammanusunu
koḍĕgām̐ḍa yĕṟum̐gaga kŏsare nenu
goḍamīm̐di sunnamula gora nŏluvam̐gām̐ bode
vīḍenagu nanu vavunā vĕrri niṁtegāgā

(||siggu||)
adĕ nī sakkadanāna kāsabaḍi mohiṁchi
padarusu nī kŏṁgubaṭṭi nenu
kadisi sĕṟagu poligagu vĕduru diṁṭenu
vĕduru dībaunā vĕrri niṁte kāgā

(||siggu||)
sittamu dĕliya lega śhrīveṁkaḍeśhum̐ḍa ninnu
kŏttaradu lĕllā rem̐si kūḍidi ninnu
battigala nīyaṁdu balimivai nā valabu
vittidem̐ bŏllavŏyyīnā vĕrri niṁte kāgā