సిగ్గు వడ దప్పటి నా చిత్తము నన్నుఁ గొసరీ
(॥పల్లవి॥)
సిగ్గు వడ దప్పటి నా చిత్తము నన్నుఁ గొసరీ
అగ్గలపు చనవులు అప్పిచ్చినవారమా
(॥సిగ్గు॥)
కరుణించి నీవు నన్నుఁ గాఁగిలించుకొంటి గాక
వరుసల మాపై నంత వల పున్నదా
సొరిది మన్నించి నన్నుఁ జూచితి వింతె కాక
సరవితో నే నీకుఁ జక్కనిదాననా
(॥సిగ్గు॥)
సేస వెట్టినవాఁడ వై చేకొంటివి గాక నాతోఁ
బాసి వుండనంత నాపైఁ బరా కున్నదా
బాస దప్పనందుకుఁగా పక్కన నవ్వితి గాక
ఆసలఁ బెనఁగ నీకు నందరిలోవారమా
(॥సిగ్గు॥)
నీవు ధర్మపుణ్యానకు నెల వై కూడితి గాక
దావతి నానలు వెట్టఁ దగ వున్నదా
శ్రీవెంకటేశ నన్నుఁ జెనకి మెచ్చితి గాక
వావులు చెప్పఁగ నీతో వడి మేనవారమా
(||pallavi||)
siggu vaḍa dappaḍi nā sittamu nannum̐ gŏsarī
aggalabu sanavulu appichchinavāramā
(||siggu||)
karuṇiṁchi nīvu nannum̐ gām̐giliṁchugŏṁṭi gāga
varusala mābai naṁta vala punnadā
sŏridi manniṁchi nannum̐ jūsidi viṁtĕ kāga
saravido ne nīgum̐ jakkanidānanā
(||siggu||)
sesa vĕṭṭinavām̐ḍa vai segŏṁṭivi gāga nādom̐
bāsi vuṁḍanaṁta nābaim̐ barā kunnadā
bāsa dappanaṁdugum̐gā pakkana navvidi gāga
āsalam̐ bĕnam̐ga nīgu naṁdarilovāramā
(||siggu||)
nīvu dharmabuṇyānagu nĕla vai kūḍidi gāga
dāvadi nānalu vĕṭṭam̐ daga vunnadā
śhrīvĕṁkaḍeśha nannum̐ jĕnagi mĕchchidi gāga
vāvulu sĕppam̐ga nīdo vaḍi menavāramā