Siggarigaamtala nimta simmi remturaa

సిగ్గరికాంతల నింత చిమ్మి రేఁతురా
Language

(॥పల్లవి॥)
సిగ్గరికాంతల నింత చిమ్మి రేఁతురా
కగ్గు లేనివారి నేల కాకుసేసే విపుడు

(॥సిగ్గరి॥)
మా నెక్కి పువ్వులుగోసేమగువలఁ జూచి, మోవి
తేనె లడిగేవు నీవు దిగువనుండి
తేనెలైతేఁ పూవులపై తేఁటుల నడుగవలె
మానని తరితీపులే మావల్లఁ గలవు

(॥సిగ్గరి॥)
సరసిలో నీఁదులాడే సతులనుఁ జూచి, నీవు
విరు లడిగేవు నేఁడు దరినే వుండి
విరులు గావలసితే వెస వసంతము రానీ
మరిగించే తావులే మాయందుఁ గలవు

(॥సిగ్గరి॥)
వొప్పుగు శ్రీవేంకటేశ వున్నవారి మమ్ముఁ గూడి
కప్పురము లడిగేవు కౌఁగిటనుండి
కప్పుర మెంతైనాఁ గద్దు కనకపుఁబెట్టెలను
దప్పిదీర్చేపలుకు విత్తరి మాకుఁ గలవూ

(||pallavi||)
siggarigāṁtala niṁta simmi rem̐turā
kaggu lenivāri nela kāgusese vibuḍu

(||siggari||)
mā nĕkki puvvulugosemaguvalam̐ jūsi, movi
tenĕ laḍigevu nīvu diguvanuṁḍi
tenĕlaidem̐ pūvulabai tem̐ṭula naḍugavalĕ
mānani taridībule māvallam̐ galavu

(||siggari||)
sarasilo nīm̐dulāḍe sadulanum̐ jūsi, nīvu
viru laḍigevu nem̐ḍu darine vuṁḍi
virulu gāvalaside vĕsa vasaṁtamu rānī
marigiṁche tāvule māyaṁdum̐ galavu

(||siggari||)
vŏppugu śhrīveṁkaḍeśha vunnavāri mammum̐ gūḍi
kappuramu laḍigevu kaum̐giḍanuṁḍi
kappura mĕṁtainām̐ gaddu kanagabum̐bĕṭṭĕlanu
dappidīrsebalugu vittari māgum̐ galavū