సిగ్గరికాఁడతఁడు చెప్పఁడు మనతో నేవి
(॥పల్లవి॥)
సిగ్గరికాఁడతఁడు చెప్పఁడు మనతో నేవి
యెగ్గులెంచ నేనతని యీడకుఁ బిలువరే
(॥సిగ్గ॥)
పొంతనె సాములు సేయఁబోలు మేను చెమరించె
వంతుకు నిద్రించఁబోలు వదలెఁ గొప్పు
సంతమాటలాడఁబోలు చక్కనిమోవి గంటాయ
కాంతుని కుపచారాలు కడుమీరు సేయరే
(॥సిగ్గ॥)
కమ్మి యీఁదులాడఁబోలు కస్తూరిబొట్టు చెదరె
వుమ్మడి కొండెక్కఁబోలు వూర్పులు రేఁగె
పమ్మి జాజరాడఁబోలు పచ్చడము పసపాయ
సొమ్ములతోడి ఆతనిఁజూచి మీరు మెచ్చరే
(॥సిగ్గ॥)
పువ్వుఁదోఁటనుండఁబోలు పొసఁగ మై వాసనంటె
నవ్వఁబోలు మేలు(ను?) మిన్నక యలసె
రవ్వగా నన్నుఁగూడి రతులను జొక్కించె
ఇవ్వల శ్రీ వెంకటేశు యేతులెల్లాఁ జూడరే
(||pallavi||)
siggarigām̐ḍadam̐ḍu sĕppam̐ḍu manado nevi
yĕggulĕṁcha nenadani yīḍagum̐ biluvare
(||sigga||)
pŏṁtanĕ sāmulu seyam̐bolu menu sĕmariṁchĕ
vaṁtugu nidriṁcham̐bolu vadalĕm̐ gŏppu
saṁtamāḍalāḍam̐bolu sakkanimovi gaṁṭāya
kāṁtuni kubasārālu kaḍumīru seyare
(||sigga||)
kammi yīm̐dulāḍam̐bolu kastūribŏṭṭu sĕdarĕ
vummaḍi kŏṁḍĕkkam̐bolu vūrbulu rem̐gĕ
pammi jājarāḍam̐bolu pachchaḍamu pasabāya
sŏmmuladoḍi ādanim̐jūsi mīru mĕchchare
(||sigga||)
puvvum̐dom̐ṭanuṁḍam̐bolu pŏsam̐ga mai vāsanaṁṭĕ
navvam̐bolu melu(nu?) minnaga yalasĕ
ravvagā nannum̐gūḍi radulanu jŏkkiṁchĕ
ivvala śhrī vĕṁkaḍeśhu yedulĕllām̐ jūḍare