సిగ్గరి చెలులము నీచిత్తము వచ్చునో రాదో
(॥పల్లవి॥)
సిగ్గరి చెలులము నీచిత్తము వచ్చునో రాదో
యెగ్గులు తప్పులెంతుము యింతేసికి నోప
(॥సిగ్గ॥)
చనవు లెల్ల నెరపి సలిగెలఁ బొరలుచు
ననుపు నీ కాపె సేసీ నాయెదుటనె
మనసు వచ్చు నీ కది మాకు నిన్ను నన నేల
చెనకి యింకా బనులు నేయించుకో నీవు
(॥సిగ్గ॥)
తగులాలు చెప్పుకొని దండ నుండి కుంచ వేసి
నగీ నాపె నీతోను నాయెదటనె
జిగి నీకు బ్రియ మిది చింతలు రేఁచఁగ నేల
వొగరు లే కింకా నందె వోలలాడు నీవు
(॥సిగ్గ॥)
అంటి మేను దాఁకించి ఆకుమడిచి నీ కిచ్చి
నంటు సేసీ నీతోను నాయెదుటనె
గొంటవై శ్రీవెంకటేశ కూడితిని నన్ను నిట్టె
దంటతనమున నవి తలఁచుకో నీవు
(||pallavi||)
siggari sĕlulamu nīsittamu vachchuno rādo
yĕggulu tappulĕṁtumu yiṁtesigi noba
(||sigga||)
sanavu lĕlla nĕrabi saligĕlam̐ bŏralusu
nanubu nī kābĕ sesī nāyĕduḍanĕ
manasu vachchu nī kadi māgu ninnu nana nela
sĕnagi yiṁkā banulu neyiṁchugo nīvu
(||sigga||)
tagulālu sĕppugŏni daṁḍa nuṁḍi kuṁcha vesi
nagī nābĕ nīdonu nāyĕdaḍanĕ
jigi nīgu briya midi siṁtalu rem̐sam̐ga nela
vŏgaru le kiṁkā naṁdĕ volalāḍu nīvu
(||sigga||)
aṁṭi menu dām̐kiṁchi āgumaḍisi nī kichchi
naṁṭu sesī nīdonu nāyĕduḍanĕ
gŏṁṭavai śhrīvĕṁkaḍeśha kūḍidini nannu niṭṭĕ
daṁṭadanamuna navi talam̐sugo nīvu