సిగ్గరి పెండ్లికూఁతురు చెలియ నింతసేతురా
(॥పల్లవి॥)
సిగ్గరి పెండ్లికూఁతురు చెలియ నింతసేతురా
తగ్గక సెలవి నవ్వు తతిగొనెను
(॥సిగ్గ॥)
పువ్వుల వేసినవేటు పుప్పొడి నిండాఁ జింది
జవ్వని చన్నులమీఁద జాజుకొనెను
చివ్వన మైచెమరించి చిత్తడిచెమటతోడ
దువ్వటపుఁ బయ్యదెల్లాఁ దొప్పఁదోఁగెను
(॥సిగ్గ॥)
పన్నీటఁ జిమ్మిన చిమ్ము పదను పైపైఁ గప్పి
కన్నెచెక్కులమీఁద కారుకమ్మెను
వున్నతితోఁ బులకించి వొగిఁ బోకముడి జారి
తన్నుఁదానె నిట్టూర్పులఁ దడఁబడెను
(॥సిగ్గ॥)
గందానఁ బూసినపూఁత కడగి లప్పలు గట్టి
యిందుముఖెలమేల్మంగకింపులాయను
కందువ శ్రీ వేంకటేశు కౌఁగిటఁ బేంట్లు రాలి
సందడిరతులలోన సంగతాయను
(||pallavi||)
siggari pĕṁḍligūm̐turu sĕliya niṁtasedurā
taggaga sĕlavi navvu tadigŏnĕnu
(||sigga||)
puvvula vesinaveḍu puppŏḍi niṁḍām̐ jiṁdi
javvani sannulamīm̐da jājugŏnĕnu
sivvana maisĕmariṁchi sittaḍisĕmaḍadoḍa
duvvaḍabum̐ bayyadĕllām̐ dŏppam̐dom̐gĕnu
(||sigga||)
pannīḍam̐ jimmina simmu padanu paibaim̐ gappi
kannĕsĕkkulamīm̐da kārugammĕnu
vunnadidom̐ bulagiṁchi vŏgim̐ bogamuḍi jāri
tannum̐dānĕ niṭṭūrbulam̐ daḍam̐baḍĕnu
(||sigga||)
gaṁdānam̐ būsinabūm̐ta kaḍagi lappalu gaṭṭi
yiṁdumukhĕlamelmaṁgagiṁpulāyanu
kaṁduva śhrī veṁkaḍeśhu kaum̐giḍam̐ beṁṭlu rāli
saṁdaḍiradulalona saṁgadāyanu