సిగ్గరి పెండ్లికొడుకు చెలుల ముందరనెల్లా
(॥పల్లవి॥)
సిగ్గరి పెండ్లికొడుకు చెలుల ముందరనెల్లా
యెగ్గెరఁగక మెరసీ నిదివో యనుచు
(॥॥)
జంటతేరులమీఁద సతులు నీవును నెక్కి
యింటింట వీదివీది నేఁగిరాఁగాను
పెంటలగోపకలెల్లా పెదపెదమేడ లెక్కి
నంటునఁ జూచి సిగ్గుతో నవ్వులు నవ్వేరు
(॥॥)
గొడుగులనీడను కోలుపడిగెలతోడ
యెడనెడవాడల నోవేఁగిరాఁగాను
మెడలెత్తి నీపొందుల మెలుఁత లబ్బురమంది
జడిగొని తోఁగిచూచి జాణతనాలాడేరు
(॥॥)
విరులదండలలోన వింజామరలలోన
యిరవై దేవుళ్ళు నీవు నేఁగిరాఁగాను
పరగ నల మేల్మంగపతివి శ్రీవేంకటేశ
సొరిదిఁ ఋరసతులు చూచి పొగడేరు
(||pallavi||)
siggari pĕṁḍligŏḍugu sĕlula muṁdaranĕllā
yĕggĕram̐gaga mĕrasī nidivo yanusu
(||||)
jaṁṭaderulamīm̐da sadulu nīvunu nĕkki
yiṁṭiṁṭa vīdivīdi nem̐girām̐gānu
pĕṁṭalagobagalĕllā pĕdabĕdameḍa lĕkki
naṁṭunam̐ jūsi siggudo navvulu navveru
(||||)
gŏḍugulanīḍanu kolubaḍigĕladoḍa
yĕḍanĕḍavāḍala novem̐girām̐gānu
mĕḍalĕtti nībŏṁdula mĕlum̐ta labburamaṁdi
jaḍigŏni tom̐gisūsi jāṇadanālāḍeru
(||||)
viruladaṁḍalalona viṁjāmaralalona
yiravai devuḽḽu nīvu nem̐girām̐gānu
paraga nala melmaṁgabadivi śhrīveṁkaḍeśha
sŏridim̐ ṛrasadulu sūsi pŏgaḍeru