Sidumudi siggunam jelamgeeni

చిడుముడి సిగ్గునఁ జెలఁగీని
Language

(॥పల్లవి॥)
చిడుముడి సిగ్గునఁ జెలఁగీని
విడువక చేకొను విభుఁడవు నీవు

(॥చిడు॥)
మలయుచు సొలయుచు మాటలాడఁగా
చెలిని గోరికొనఁ జెనకేవు
నిలిచె రేకలై నిండుఁ జెక్కులను
పిలిచి వేఁడుకో ప్రియుఁడవు నీవు

(॥చిడు॥)
పలుమరు నెదుటను పనులు సేయఁగా
బలిమిఁ బెనంగుచుఁ బదరేవు
అలపుల చెమటలు అలరెను తనువున
కలసి మన్నించుము ఘనుఁడవు నీవు

(॥చిడు॥)
గుఱుతుగఁ గాఁగిటఁ గూడి మెచ్చఁగా
నెఱిఁ బలుసోఁకులు నించేవు
మెఱసెను మోవిని మించి వురమునను
యెఱుకతో శ్రీవేంకటేశ్వర నీవు

(||pallavi||)
siḍumuḍi siggunam̐ jĕlam̐gīni
viḍuvaga segŏnu vibhum̐ḍavu nīvu

(||siḍu||)
malayusu sŏlayusu māḍalāḍam̐gā
sĕlini gorigŏnam̐ jĕnagevu
nilisĕ regalai niṁḍum̐ jĕkkulanu
pilisi vem̐ḍugo priyum̐ḍavu nīvu

(||siḍu||)
palumaru nĕduḍanu panulu seyam̐gā
balimim̐ bĕnaṁgusum̐ badarevu
alabula sĕmaḍalu alarĕnu tanuvuna
kalasi manniṁchumu ghanum̐ḍavu nīvu

(||siḍu||)
guṟudugam̐ gām̐giḍam̐ gūḍi mĕchcham̐gā
nĕṟim̐ balusom̐kulu niṁchevu
mĕṟasĕnu movini miṁchi vuramunanu
yĕṟugado śhrīveṁkaḍeśhvara nīvu