Shunaga soogaraadulu suga mamde pomdinatlu

శునక సూకరాదులు సుక మందే పొందినట్లు
Language

(॥పల్లవి॥)
శునక సూకరాదులు సుక మందే పొందినట్లు
ఘనము గానక మసి కస్తూరాయ నాకు

(॥శునక॥)
యేపున బ్రహ్మానంద మెఱుఁగని వాఁడఁ గనఁ
బాపపు హేయసుఖమె బాఁతి నాకును
చూపుల వైకుంఠము చూడనివాఁడఁగన
తీపులు ప్రపంచమందు తిరమాయ నాకూ

(॥శునక॥)
చాయల శ్రీహరి భక్తి చాలనివాఁడఁగనక
తోయరాని కర్మములు దొడ్డాయ నాకు
నాయంత నా జ్ఞానము నమ్మనివాఁడఁ గనక
మాయపు సంసారమే మనసాయ నాకు

(॥శునక॥)
శ్రీ వేంకటేశు ధ్యానము సేయనివాఁడఁ గనక
అవలఁ బరదేవత లరుదు నాకు
ఈవల యితఁడె నన్ను యింతగా మన్నించెఁ గన
పావనమై జన్న మిది వచ్చి దోఁచె నాకు

(||pallavi||)
śhunaga sūgarādulu suga maṁde pŏṁdinaṭlu
ghanamu gānaga masi kastūrāya nāgu

(||śhunaga||)
yebuna brahmānaṁda mĕṟum̐gani vām̐ḍam̐ ganam̐
bābabu heyasukhamĕ bām̐ti nāgunu
sūbula vaiguṁṭhamu sūḍanivām̐ḍam̐gana
tībulu prabaṁchamaṁdu tiramāya nāgū

(||śhunaga||)
sāyala śhrīhari bhakti sālanivām̐ḍam̐ganaga
toyarāni karmamulu dŏḍḍāya nāgu
nāyaṁta nā jñānamu nammanivām̐ḍam̐ ganaga
māyabu saṁsārame manasāya nāgu

(||śhunaga||)
śhrī veṁkaḍeśhu dhyānamu seyanivām̐ḍam̐ ganaga
avalam̐ baradevada larudu nāgu
īvala yidam̐ḍĕ nannu yiṁtagā manniṁchĕm̐ gana
pāvanamai janna midi vachchi dom̐sĕ nāgu