శ్రావణబహుళాష్టమి జయంతి నేఁడు
(॥పల్లవి॥)
శ్రావణబహుళాష్టమి జయంతి నేఁడు
సేవించరో నరులాల శ్రీకృష్ణుఁడిఁతఁడు
(॥శ్రావణ॥)
భావింప వసుదేవుని పాలిటి భాగ్యదేవత
దేవకి గనినయట్టి దివ్యరత్నము
చేవమీర సురల రక్షించే కల్పతరువు
యీవేళ జన్మించినాఁడు యిదె కృష్ణుఁడు
(॥శ్రావణ॥)
హర విరంచాదులకు నాదిమూల కారణము
పరమమునుల తపఃఫల సారము
గరుడోరగేంద్రులకుఁ గలిగిన నిధానము
యిరవుగా నుదయించెనిదె కృష్ణుఁడు
(॥శ్రావణ॥)
బలుయోగీశ్వరుల బ్రహ్మానందము
చెలఁగు భాగవతుల చింతామణి
అలమేల్మంగకు బతియట్టె శ్రీవేంకటాద్రి-
నిలపై జన్మించినాఁడు యిదె కృష్ణుఁడు
(||pallavi||)
śhrāvaṇabahuḽāṣhṭami jayaṁti nem̐ḍu
seviṁcharo narulāla śhrīkṛṣhṇum̐ḍim̐tam̐ḍu
(||śhrāvaṇa||)
bhāviṁpa vasudevuni pāliḍi bhāgyadevada
devagi ganinayaṭṭi divyaratnamu
sevamīra surala rakṣhiṁche kalbadaruvu
yīveḽa janmiṁchinām̐ḍu yidĕ kṛṣhṇum̐ḍu
(||śhrāvaṇa||)
hara viraṁchādulagu nādimūla kāraṇamu
paramamunula tabaḥphala sāramu
garuḍorageṁdrulagum̐ galigina nidhānamu
yiravugā nudayiṁchĕnidĕ kṛṣhṇum̐ḍu
(||śhrāvaṇa||)
baluyogīśhvarula brahmānaṁdamu
sĕlam̐gu bhāgavadula siṁtāmaṇi
alamelmaṁgagu badiyaṭṭĕ śhrīveṁkaḍādri-
nilabai janmiṁchinām̐ḍu yidĕ kṛṣhṇum̐ḍu