శిష్టులను మన్నించే శిశు వీతఁడు
(॥పల్లవి॥)
శిష్టులను మన్నించే శిశు వీతఁడు
దుష్టుల నణఁచి భూమిఁ దుదకెక్కు నీతఁడు
(॥శిష్టు॥)
దేవకీదేవివసుదేవులకు జనియ్యించే
భావించఁ గృష్టుఁడు పరబ్రహ్మము నేఁడు
శ్రావణ బహుళాష్టమి సమకూడె నడురేయి
యావేళ రోహిణి యిన్నిటను మంచిది
(॥శిష్టు॥)
గండముతొఁ బుట్టె నదె కంసునికి మేనల్లుఁడు
పాండవుల కందరికి బావమఱఁది
దుండగపు భూభారము తొలఁగదొబ్బు నీతఁడు
యెండనీడ కన్నులవాఁ డిఁక నింతా మంచిది
(॥శిష్టు॥)
ఆవు లీతనిపేరిట నచ్చివచ్చు లెంచి చూడ
వేవేల గొల్లెతలకు విట్టుఁ డవును
శ్రీవేంకటాద్రి నున్నాఁడు చేరి యలమేల్మంగతో
యావలఁ బెద్దలు చెప్పి రిఁక నింతా మంచిది
(||pallavi||)
śhiṣhṭulanu manniṁche śhiśhu vīdam̐ḍu
duṣhṭula naṇam̐si bhūmim̐ dudagĕkku nīdam̐ḍu
(||śhiṣhṭu||)
devagīdevivasudevulagu janiyyiṁche
bhāviṁcham̐ gṛṣhṭum̐ḍu parabrahmamu nem̐ḍu
śhrāvaṇa bahuḽāṣhṭami samagūḍĕ naḍureyi
yāveḽa rohiṇi yinniḍanu maṁchidi
(||śhiṣhṭu||)
gaṁḍamudŏm̐ buṭṭĕ nadĕ kaṁsunigi menallum̐ḍu
pāṁḍavula kaṁdarigi bāvamaṟam̐di
duṁḍagabu bhūbhāramu tŏlam̐gadŏbbu nīdam̐ḍu
yĕṁḍanīḍa kannulavām̐ ḍim̐ka niṁtā maṁchidi
(||śhiṣhṭu||)
āvu līdaniberiḍa nachchivachchu lĕṁchi sūḍa
vevela gŏllĕdalagu viṭṭum̐ ḍavunu
śhrīveṁkaḍādri nunnām̐ḍu seri yalamelmaṁgado
yāvalam̐ bĕddalu sĕppi rim̐ka niṁtā maṁchidi