శిరసుండఁగా మోకాల సేస వెట్టవచ్చునా
(॥పల్లవి॥)
శిరసుండఁగా మోకాల సేస వెట్టవచ్చునా
సరి నీపెఁ జిత్తగించి మన్నించవయ్యా
(॥శిర॥)
కొత్తకొత్త విన్నపాలు కొమ్మ నీతోఁ జేయఁగాను
ఇత్తల వేరొకతెతో నేమి నవ్వేవు
పోత్తుల నాకుమడిచి పొరచి నీకియ్యఁగాను
హత్తి మోవివిందులు నీవాపెకేల పెట్టేవు
(॥శిర॥)
వేడుకతోఁ గన్నులను వెలఁది నిన్నుఁ జూడఁగా
వూడిగపుదానినేల వొడివట్టేవు
వాడికతో జవరాలు వలపు నీపైఁ జల్లఁగా
యీడుగానిదాని నీవేల కాఁగిలించేవు
(॥శిర॥)
చిడుముడి నీదేవులు సేస నీపైఁ జల్లఁగాను
కడనున్నదానికేల కాలుచాఁచేవు
అడరి శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
పడఁతిఁ గూడితి వాపెపస లేమిచూచేవు
(||pallavi||)
śhirasuṁḍam̐gā mogāla sesa vĕṭṭavachchunā
sari nībĕm̐ jittagiṁchi manniṁchavayyā
(||śhira||)
kŏttagŏtta vinnabālu kŏmma nīdom̐ jeyam̐gānu
ittala verŏgadĕdo nemi navvevu
pottula nāgumaḍisi pŏrasi nīgiyyam̐gānu
hatti moviviṁdulu nīvābĕgela pĕṭṭevu
(||śhira||)
veḍugadom̐ gannulanu vĕlam̐di ninnum̐ jūḍam̐gā
vūḍigabudāninela vŏḍivaṭṭevu
vāḍigado javarālu valabu nībaim̐ jallam̐gā
yīḍugānidāni nīvela kām̐giliṁchevu
(||śhira||)
siḍumuḍi nīdevulu sesa nībaim̐ jallam̐gānu
kaḍanunnadānigela kālusām̐sevu
aḍari śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
paḍam̐tim̐ gūḍidi vābĕbasa lemisūsevu