Shirasumda momkaaligi sesalu vettamganela

శిరసుండ మోఁకాలికి సేసలు వెట్టఁగనేల
Language

(॥పల్లవి॥)
శిరసుండ మోఁకాలికి సేసలు వెట్టఁగనేల
గరిమల నాపెనే కాఁగిలించరాదా

(॥శిర॥)
నిండిన కాఁతాళము నీమీఁద నుండఁగాను
అండవారిమాటలు ఆపె వినీనా
చండిపెట్టి వొడఁబరచకువయ్య మమ్ము నింత
దండిగా నాపెఁ గాఁగిటఁ దనుపరాదా

(॥శిర॥)
ముప్పిరిఁ జూపులు నీపై ముంచుకొని వుండఁగాను
ఇప్పుడు నీ కానుకలు యెంచీనా ఆపె
చప్పుడు సేసి మాకెంత సన్నలెల్లాఁ జూపేవు
అప్పటి నాపెచేతికి నందియ్యరాదా

(॥శిర॥)
శ్రీ వేంకటేశ కాఁగిలి చేరి నీ మై నుండఁగాను
యీ వినయాలెరుఁగునా యెంతైనానాపె
మావంటివారినెల్లా మరి యెంత మన్నించేవు
దేవులై న ఆపెనే తెలుపరాదా

(||pallavi||)
śhirasuṁḍa mom̐kāligi sesalu vĕṭṭam̐ganela
garimala nābĕne kām̐giliṁcharādā

(||śhira||)
niṁḍina kām̐tāḽamu nīmīm̐da nuṁḍam̐gānu
aṁḍavārimāḍalu ābĕ vinīnā
saṁḍibĕṭṭi vŏḍam̐barasaguvayya mammu niṁta
daṁḍigā nābĕm̐ gām̐giḍam̐ danubarādā

(||śhira||)
muppirim̐ jūbulu nībai muṁchugŏni vuṁḍam̐gānu
ippuḍu nī kānugalu yĕṁchīnā ābĕ
sappuḍu sesi māgĕṁta sannalĕllām̐ jūbevu
appaḍi nābĕsedigi naṁdiyyarādā

(||śhira||)
śhrī veṁkaḍeśha kām̐gili seri nī mai nuṁḍam̐gānu
yī vinayālĕrum̐gunā yĕṁtainānābĕ
māvaṁṭivārinĕllā mari yĕṁta manniṁchevu
devulai na ābĕne tĕlubarādā