Shirasu vamchagu mimka shreenarasimhaa | nee

శిరసు వంచకు మిఁక శ్రీనరసింహా । నీ
Language

(॥పల్లవి॥)
శిరసు వంచకు మిఁక శ్రీనరసింహా । నీ-
సిరు లెన్నైనాఁ గలవు శ్రీనరసింహా

(॥శిర॥)
చెలి నీతోడపై నెక్కె శ్రీనరసింహా
చెలరేఁగె నీమోము శ్రీనరసింహా
సెలవుల నవ్వుదేరె శ్రీనరసింహా నీమై
చెలప చెమట లుబ్బె శ్రీనరసింహా

(॥శిర॥)
చేరఁడేసికన్ను ల శ్రీనరసింహా
చీరుమూరాడీ వలపు శ్రీనరసింహా
చీరకొంగంటేవేమీ శ్రీనరసింహా
చేరె నీకు నామేలు శ్రీనరసింహా

(॥శిర॥)
చేవల్లకు వచ్చితివి శ్రీ నరసింహా నా-
సేవలెల్లా మెచ్చితివి శ్రీనరసింహా
శ్రీవేంకటాద్రి మీఁది శ్రీనరసింహా
చేవమీరె నీవేడుక శ్రీనరసింహా

(||pallavi||)
śhirasu vaṁchagu mim̐ka śhrīnarasiṁhā | nī-
siru lĕnnainām̐ galavu śhrīnarasiṁhā

(||śhira||)
sĕli nīdoḍabai nĕkkĕ śhrīnarasiṁhā
sĕlarem̐gĕ nīmomu śhrīnarasiṁhā
sĕlavula navvuderĕ śhrīnarasiṁhā nīmai
sĕlaba sĕmaḍa lubbĕ śhrīnarasiṁhā

(||śhira||)
seram̐ḍesigannu la śhrīnarasiṁhā
sīrumūrāḍī valabu śhrīnarasiṁhā
sīragŏṁgaṁṭevemī śhrīnarasiṁhā
serĕ nīgu nāmelu śhrīnarasiṁhā

(||śhira||)
sevallagu vachchidivi śhrī narasiṁhā nā-
sevalĕllā mĕchchidivi śhrīnarasiṁhā
śhrīveṁkaḍādri mīm̐di śhrīnarasiṁhā
sevamīrĕ nīveḍuga śhrīnarasiṁhā