శిరసెత్తి చూడవయ్యా సిగ్గువడకా
(॥పల్లవి॥)
శిరసెత్తి చూడవయ్యా సిగ్గువడకా
పెరుగఁగా మీఁద మీఁదఁ బేరీఁ జుమ్మీ వలపు
(॥॥)
గుబ్బలపై గందము గొప్ప వుంటసేసి యింతి
వుబ్బుచు నిన్ను వేయఁగా నూరకుండేవు
గబ్బితనమున నాపె కమ్మటి నిమ్మ పంటను
గొబ్బున వేయఁగా నీ కొప్పు దాఁకె నిదివో
(॥॥)
కొప్పులోని తామెరఁగొని నిన్ను వేయఁగాను
వొప్పుగా మాటలాడ కూర కుండేవు
కప్పురపు లప్ప నిట్టే కాంత నీపై మీఁటఁ గాను
చిప్పిలుఁ జెమట తోడి చెక్కు దాకె నిదివో
(॥॥)
నిగ్గునఁ జెలి సురటి నీకుఁ జూపి వీయఁగాను
వొగ్గుచు నందుకొనక వూరకుండేవు
అగ్గమై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
దగ్గరి కూడఁ గాఁ గళ దాఁకె నీకు నిదివో
(||pallavi||)
śhirasĕtti sūḍavayyā sigguvaḍagā
pĕrugam̐gā mīm̐da mīm̐dam̐ berīm̐ jummī valabu
(||||)
gubbalabai gaṁdamu gŏppa vuṁṭasesi yiṁti
vubbusu ninnu veyam̐gā nūraguṁḍevu
gabbidanamuna nābĕ kammaḍi nimma paṁṭanu
gŏbbuna veyam̐gā nī kŏppu dām̐kĕ nidivo
(||||)
kŏppuloni tāmĕram̐gŏni ninnu veyam̐gānu
vŏppugā māḍalāḍa kūra kuṁḍevu
kappurabu lappa niṭṭe kāṁta nībai mīm̐ṭam̐ gānu
sippilum̐ jĕmaḍa toḍi sĕkku dāgĕ nidivo
(||||)
niggunam̐ jĕli suraḍi nīgum̐ jūbi vīyam̐gānu
vŏggusu naṁdugŏnaga vūraguṁḍevu
aggamai śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ
daggari kūḍam̐ gām̐ gaḽa dām̐kĕ nīgu nidivo