శిరసెత్తఁ గదవయ్య శ్రీనారసింహ నీ
(॥పల్లవి॥)
శిరసెత్తఁ గదవయ్య శ్రీనారసింహ నీ-
సిరులెల్లా నేనే కానా శ్రీనారసింహ
(॥శిర॥)
చెలుల నంపితివేల శ్రీనారసింహ నాకు
సెలవుల నవ్వు వచ్చె శ్రీనారసింహ
చెలువపు నిన్నుఁ జూచి శ్రీనారసింహ నీపై
చిలికితి మోహమెల్ల శ్రీనారసింహ
(॥శిర॥)
చిత్తాన నిన్నుఁ దలఁచి శ్రీనారసింహ నే
చిత్తరు పతిమ నైతి శ్రీనారసింహ
చిత్తవాన చెమటల శ్రీనారసింహ యేల
చిత్తిణిగుణము నీకు శ్రీనారసింహ
(॥శిర॥)
శ్రీసతి నీ తొడ యెక్కె శ్రీనారసింహ నీవు
సేసవెట్టితి వాపెపై శ్రీనారసింహ
చేసన్న శ్రీవేంకటాద్రి శ్రీనారసింహ యింత
సేసినన్నుఁ గూడితివి శ్రీనారసింహ
(||pallavi||)
śhirasĕttam̐ gadavayya śhrīnārasiṁha nī-
sirulĕllā nene kānā śhrīnārasiṁha
(||śhira||)
sĕlula naṁpidivela śhrīnārasiṁha nāgu
sĕlavula navvu vachchĕ śhrīnārasiṁha
sĕluvabu ninnum̐ jūsi śhrīnārasiṁha nībai
siligidi mohamĕlla śhrīnārasiṁha
(||śhira||)
sittāna ninnum̐ dalam̐si śhrīnārasiṁha ne
sittaru padima naidi śhrīnārasiṁha
sittavāna sĕmaḍala śhrīnārasiṁha yela
sittiṇiguṇamu nīgu śhrīnārasiṁha
(||śhira||)
śhrīsadi nī tŏḍa yĕkkĕ śhrīnārasiṁha nīvu
sesavĕṭṭidi vābĕbai śhrīnārasiṁha
sesanna śhrīveṁkaḍādri śhrīnārasiṁha yiṁta
sesinannum̐ gūḍidivi śhrīnārasiṁha