Shirasela vamchevu sigguvadanemidigi

శిరసేల వంచేవు సిగ్గువడనేమిటికి
Language

(॥పల్లవి॥)
శిరసేల వంచేవు సిగ్గువడనేమిటికి
సరుస నాతఁడున్నాఁడు చవులు వుట్టించవే

(॥శిర॥)
యేలమితో రమణుఁడు యెంత చెనకినా
వలపు వేసటౌనా వనితకును
చెలఁగి యెన్నిమారులు సెలవుల నవ్వినాను
వెలలేనివేడుకకు వెలితి యాలౌను

(॥శిర॥)
గనముగా నెన్నాళ్లు కాఁపురము సేసినాను
మనసు దనియునా మగువకును
యెనసిన పచ్చిమాట లెన్నిమారు లాడినాను
వినయపు టేకతాలు వెగటు లేలౌను

(॥శిర॥)
జమళిఁగన్నుల మోము సారెసారెఁ జూచినాను
తమక ముడుగునా తరుణికిని
అమరె శ్రీవెంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
సమరతి మీకు మొగచాటు లేలవును

(||pallavi||)
śhirasela vaṁchevu sigguvaḍanemiḍigi
sarusa nādam̐ḍunnām̐ḍu savulu vuṭṭiṁchave

(||śhira||)
yelamido ramaṇum̐ḍu yĕṁta sĕnaginā
valabu vesaḍaunā vanidagunu
sĕlam̐gi yĕnnimārulu sĕlavula navvinānu
vĕlaleniveḍugagu vĕlidi yālaunu

(||śhira||)
ganamugā nĕnnāḽlu kām̐puramu sesinānu
manasu daniyunā maguvagunu
yĕnasina pachchimāḍa lĕnnimāru lāḍinānu
vinayabu ṭegadālu vĕgaḍu lelaunu

(||śhira||)
jamaḽim̐gannula momu sārĕsārĕm̐ jūsinānu
tamaga muḍugunā taruṇigini
amarĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavu nīvu
samaradi mīgu mŏgasāḍu lelavunu