Shiramda mogaala shesa yemtigi

శిరండ మోకాల శేస యేఁటికి
Language

(॥పల్లవి॥)
శిరండ మోకాల శేస యేఁటికి
సరసము లాకెపైనే చల్లరాదా నీవు

(॥॥)
ఆకెతో మారుత్తరము లాడరాదా విచ్చేసి
పైకొని మమ్మేవొడఁబరచే వీడ
యీకడ మాకుఁ బ్రియము లేలచెప్పే వింతేసి
తూకొని మొక్కఁగరాదా తొయ్యలికే నీవు

(॥॥)
అంగనతో వచ్చేనంటా నానవెట్టుక రారాదా
వుంగిటి మాతో వట్టివొట్లేఁటికి
సంగతి గాని మాతోడి జాణతనా లేమిటికి
కంగువాయఁ జెలితోనే కడునవ్వరాదా

(॥॥)
వొక్కమారే ఆకెమీఁద నొరగుకొనఁగరాదా
వెక్కసాన మాపైఁ జేయివేయ నేఁటికి
ఇక్కువ శ్రీవేంకటేశ ఇంతి నేఁడు గూడితివి
పక్కన నెన్నఁడు నింకఁబాయకుండరాదా

(||pallavi||)
śhiraṁḍa mogāla śhesa yem̐ṭigi
sarasamu lāgĕbaine sallarādā nīvu

(||||)
āgĕdo māruttaramu lāḍarādā vichchesi
paigŏni mammevŏḍam̐barase vīḍa
yīgaḍa māgum̐ briyamu lelasĕppe viṁtesi
tūgŏni mŏkkam̐garādā tŏyyalige nīvu

(||||)
aṁganado vachchenaṁṭā nānavĕṭṭuga rārādā
vuṁgiḍi mādo vaṭṭivŏṭlem̐ṭigi
saṁgadi gāni mādoḍi jāṇadanā lemiḍigi
kaṁguvāyam̐ jĕlidone kaḍunavvarādā

(||||)
vŏkkamāre āgĕmīm̐da nŏragugŏnam̐garādā
vĕkkasāna mābaim̐ jeyiveya nem̐ṭigi
ikkuva śhrīveṁkaḍeśha iṁti nem̐ḍu gūḍidivi
pakkana nĕnnam̐ḍu niṁkam̐bāyaguṁḍarādā