(॥పల్లవి॥)
శిన్నెక తేవే శెలువుని తా
వెన్నలు సవిగొను వెన్నుని తా
(॥శిన్నెక॥)
మూటల్ మాటల్ మూరల్ బారల్
బాటల్ సదివే బాపలు తా
వేటల్ వీపుల్ వేలుపు గుడుపుల్
తేటలు మరగిన దేవుని తా
(॥శిన్నెక॥)
వాకుల్ చీకుల్ వాదుల్ పోదుల్
సోకపు తొల్లిటి సుద్దుల్ తా
పోకులు లోకుల్ పొగడఁగ మనిపెడి
కేకిగరుల తల కిష్ణుని తా
(॥శిన్నెక॥)
బగ్గుల్ నగ్గుల్ బావుల్ సొరెగా
దగ్గర వెరపగు తపసుల తా
సిగ్గుల్ వాపెడి శ్రీ వేంకటపతి-
నగ్గపు సొమ్ములయాతని తా