శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ
(॥పల్లవి॥)
శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ
శరణాగతే దిక్కు సామజవరదా
(॥శరణు॥)
వేయిశిరసులతోడి విశ్వరూపమా
బాయట నీ పరంజ్యోతి పరబ్రహ్మమా
మ్రోయుచున్న వేదముల మోహనాంగమా
చేయి చేత అనంతపు శ్రీమూరితి
(॥శరణు॥)
ముగురు వేలుపులకు మూలకందమా
వొగి మునుల ఋషుల వోంకారమా
పగటు దేవతలకు ప్రాణబంధుఁడా
జగమెల్లాఁ గన్నులైన సాకారమా
(॥శరణు॥)
వెలయు సచ్చిదానందవినోదమా
అలరు పంచవింశతి యాత్మతత్వమా
కలిగిన దాసులకు కరుణానిధీ
చెలఁగి వరములిచ్చే శ్రీవేంకటేశుఁడా
(||pallavi||)
śharaṇu śharaṇu nīgu sarveśhvarā nī
śharaṇāgade dikku sāmajavaradā
(||śharaṇu||)
veyiśhirasuladoḍi viśhvarūbamā
bāyaḍa nī paraṁjyodi parabrahmamā
mroyusunna vedamula mohanāṁgamā
seyi seda anaṁtabu śhrīmūridi
(||śharaṇu||)
muguru velubulagu mūlagaṁdamā
vŏgi munula ṛṣhula voṁkāramā
pagaḍu devadalagu prāṇabaṁdhum̐ḍā
jagamĕllām̐ gannulaina sāgāramā
(||śharaṇu||)
vĕlayu sachchidānaṁdavinodamā
alaru paṁchaviṁśhadi yātmadatvamā
kaligina dāsulagu karuṇānidhī
sĕlam̐gi varamulichche śhrīveṁkaḍeśhum̐ḍā