Sharanamtem jaalu sarveshvarunigi

శరణంటేఁ జాలు సర్వేశ్వరునికి
Language

(॥పల్లవి॥)
శరణంటేఁ జాలు సర్వేశ్వరునికి
అరయ నిందరిఁ గొట్టి అర్జునుఁ గావఁడా

(॥శరణం॥)
చేతెఁడు దవ్వె సుడీ చేరి మొక్కేవారి కెల్ల
రాతిరిఁ బగలు హరి రక్షించేచోటు
కాతరాన జీవులాల కానలేరు నమ్మలేరు
ఘాతతో శిశువునకై కంబములో వెళ్లఁడా

(॥శరణం॥)
కూఁతవెట్టు దవ్వె సుఁడీ కోరి పిలువ నేర్చితే
బాఁతి హరినామముండి పాలించేచోటు
లోఁతు గాదు వాఁతు గాదు లోలోన శ్రీపతిపేరు
నాతి మొరాలించి యీతఁడు నాఁడు గావఁడా

(॥శరణం॥)
కనుచూపు దవ్వె సుఁడీ కప్పి శ్రీ వేంకటపతి
మనసులో అందరిని మన్నించేచోటు
ననిచి యేడనుండి ధ్యానము సేసికొనినాను
వనజాక్షుఁ డీతఁడే పో వరము లొసఁగఁడా

(||pallavi||)
śharaṇaṁṭem̐ jālu sarveśhvarunigi
araya niṁdarim̐ gŏṭṭi arjunum̐ gāvam̐ḍā

(||śharaṇaṁ||)
sedĕm̐ḍu davvĕ suḍī seri mŏkkevāri kĕlla
rādirim̐ bagalu hari rakṣhiṁchesoḍu
kādarāna jīvulāla kānaleru nammaleru
ghādado śhiśhuvunagai kaṁbamulo vĕḽlam̐ḍā

(||śharaṇaṁ||)
kūm̐tavĕṭṭu davvĕ sum̐ḍī kori piluva nerside
bām̐ti harināmamuṁḍi pāliṁchesoḍu
lom̐tu gādu vām̐tu gādu lolona śhrībadiberu
nādi mŏrāliṁchi yīdam̐ḍu nām̐ḍu gāvam̐ḍā

(||śharaṇaṁ||)
kanusūbu davvĕ sum̐ḍī kappi śhrī veṁkaḍabadi
manasulo aṁdarini manniṁchesoḍu
nanisi yeḍanuṁḍi dhyānamu sesigŏninānu
vanajākṣhum̐ ḍīdam̐ḍe po varamu lŏsam̐gam̐ḍā