శరణంటే నీవు దిక్కు సర్వేశ్వరా
(॥పల్లవి॥)
శరణంటే నీవు దిక్కు సర్వేశ్వరా
నిరతి మాయావికిని నిజమేది
(॥శర॥)
యిన్నిటాఁ బుట్టిన దేహి కింక కులశీల మేది
చన్నుఁబాలకాని కాచార మేది
పన్నిన సంసారికి పరమాత్ముచింత యేది
వున్నతి జంతరపు బొమ్మ కుద్యోగ మేది
(॥శర॥)
పంచేంద్రియబద్ధునికి పట్టి స్వతంత్రమేది
చంచలచిత్తునికి విజ్ఞాన మేది
యెంచ భూతావాసుని కింకఁ జేసే ధర్మ మేది
నించి మలమూత్రకాయునికి భోగ మేది
(॥శర॥)
కామాతురునకును కర్మానుష్ఠాన మేది
వాముల నిత్యలోభికి వైరాగ్య మేది
శ్రీమంతుఁడైనయట్టి శ్రీ వేంకటేశ్వర నీవే
కామించి కాచితి గాక గతి యేది
(||pallavi||)
śharaṇaṁṭe nīvu dikku sarveśhvarā
niradi māyāvigini nijamedi
(||śhara||)
yinniḍām̐ buṭṭina dehi kiṁka kulaśhīla medi
sannum̐bālagāni kāsāra medi
pannina saṁsārigi paramātmusiṁta yedi
vunnadi jaṁtarabu bŏmma kudyoga medi
(||śhara||)
paṁcheṁdriyabaddhunigi paṭṭi svadaṁtramedi
saṁchalasittunigi vijñāna medi
yĕṁcha bhūdāvāsuni kiṁkam̐ jese dharma medi
niṁchi malamūtragāyunigi bhoga medi
(||śhara||)
kāmādurunagunu karmānuṣhṭhāna medi
vāmula nityalobhigi vairāgya medi
śhrīmaṁtum̐ḍainayaṭṭi śhrī veṁkaḍeśhvara nīve
kāmiṁchi kāsidi gāga gadi yedi