Sharanaagadumdanu visaara mimta valenaa nannu

శరణాగతుఁడను విచార మింత వలెనా నన్ను
Language

(॥పల్లవి॥)
శరణాగతుఁడను విచార మింత వలెనా నన్ను
నిరుహేతుకానఁ గావనేరవా యేమి

(॥శరణా॥)
నన్నునొక జంతువు నున్నతిఁ గాచుటకుఁగా
పన్నినట్టి కర్మములబారిఁ దోయవలెనా
మన్నన లక్ష్మీపతిని మహి నెల్ల నేలేవు
వెన్నుఁడ నన్నుఁ గావ వేఁగా యేమి

(॥శరణా॥)
పుట్టించినయట్టి నీవు పూరి మేప వెప్పుడును
కట్టిడిపరులఁ జూపి కాకు సేయవలెనా
అట్టి బ్రహ్మ గన్నతండ్రి వదె లోకములు కుక్షి
బెట్టుకున్నాఁడవు నన్నుఁ బెనుపవా నీవు

(॥శరణా॥)
అపరాధినైతిఁ బో నీ వన్నిటా న న్నేలితివి
చపలపు టాసలలో సడిఁ బెట్టవలెనా
యిపుడు శ్రీ వేంకటేశ యిన్నిటా న న్నేలితివి
కపురైన మా నుతులు ఘనము గాదయ్యా

(||pallavi||)
śharaṇāgadum̐ḍanu visāra miṁta valĕnā nannu
niruhedugānam̐ gāvaneravā yemi

(||śharaṇā||)
nannunŏga jaṁtuvu nunnadim̐ gāsuḍagum̐gā
panninaṭṭi karmamulabārim̐ doyavalĕnā
mannana lakṣhmībadini mahi nĕlla nelevu
vĕnnum̐ḍa nannum̐ gāva vem̐gā yemi

(||śharaṇā||)
puṭṭiṁchinayaṭṭi nīvu pūri meba vĕppuḍunu
kaṭṭiḍibarulam̐ jūbi kāgu seyavalĕnā
aṭṭi brahma gannadaṁḍri vadĕ logamulu kukṣhi
bĕṭṭugunnām̐ḍavu nannum̐ bĕnubavā nīvu

(||śharaṇā||)
abarādhinaidim̐ bo nī vanniḍā na nnelidivi
sabalabu ṭāsalalo saḍim̐ bĕṭṭavalĕnā
yibuḍu śhrī veṁkaḍeśha yinniḍā na nnelidivi
kaburaina mā nudulu ghanamu gādayyā