శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
(॥పల్లవి॥)
శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
వంకలాడ భుజముల వ్రాసుకొంటి మిమ్మును
(॥శంకమ॥)
నారాయణా యని యిట్టే నరకములు తరించితి
శ్రీరామా అని పొందితి జీవన్ముక్తి
దూరించి గోవిందా యని తోలితి పాపములెల్ల
ధీరుఁడనై వళుకెల్ల తిద్దుకొంటి నిదిగో
(॥శంకమ॥)
దామోదరా అని తొల్లి దాఁటితి దుఁఖము లెల్ల
వామనా అని కర్మములు వంగఁ దొక్కితి
భూమిరమణా యని పుటుగులు గెలిచితి
వేమరు నితరులకు వెరవ నే నింకను
(॥శంకమ॥)
హరి యచ్చుతా యని ఆపదల నణఁచితి
పురుషోత్తమా యని పుణ్యములెల్లా మీఱితి
అరుదైనా శ్రీ వేంకటేశ యని లోకముల మించితి
తొరలి సంసారపుదూరు చక్కఁ బెట్టితి
(||pallavi||)
śhaṁkama nīvu sākṣhi sakrama nīvu sākṣhi
vaṁkalāḍa bhujamula vrāsugŏṁṭi mimmunu
(||śhaṁkama||)
nārāyaṇā yani yiṭṭe naragamulu tariṁchidi
śhrīrāmā ani pŏṁdidi jīvanmukti
dūriṁchi goviṁdā yani tolidi pābamulĕlla
dhīrum̐ḍanai vaḽugĕlla tiddugŏṁṭi nidigo
(||śhaṁkama||)
dāmodarā ani tŏlli dām̐ṭidi dum̐khamu lĕlla
vāmanā ani karmamulu vaṁgam̐ dŏkkidi
bhūmiramaṇā yani puḍugulu gĕlisidi
vemaru nidarulagu vĕrava ne niṁkanu
(||śhaṁkama||)
hari yachchudā yani ābadala naṇam̐sidi
puruṣhottamā yani puṇyamulĕllā mīṟidi
arudainā śhrī veṁkaḍeśha yani logamula miṁchidi
tŏrali saṁsārabudūru sakkam̐ bĕṭṭidi