శమించుకోవయ్య సర్వాపరాధాలు
(॥పల్లవి॥)
శమించుకోవయ్య సర్వాపరాధాలు
కొమరె వయసు గుణాలదాన
(॥శమిం॥)
తొక్కితిఁ బాదము తొలుత నందుకు
మొక్కితి నిదివో ముమ్మాఁటికి
గక్కన నాచూపు కాఁడిన గంట్ల
చిక్కని నవ్వులు చిలికించేను
(॥శమిం॥)
వొత్తితిఁ జన్నుల వొరటువాయఁగ
పొత్తిగఁ బూవులఁ బూజించేను
లత్తుక నంటిన లచ్చన నొసల
మెత్తేను గందము మీఁదనెల్లా
(॥శమిం॥)
కూడితిఁ గాఁగిట కొసరు దీరఁగ
వీడెమింద శ్రీ వేంకటశ
వాడించితి మోవి వన్నెలు వుట్టఁగ
కూడ నే నెంచేను గుఱుతులు
(||pallavi||)
śhamiṁchugovayya sarvābarādhālu
kŏmarĕ vayasu guṇāladāna
(||śhamiṁ||)
tŏkkidim̐ bādamu tŏluda naṁdugu
mŏkkidi nidivo mummām̐ṭigi
gakkana nāsūbu kām̐ḍina gaṁṭla
sikkani navvulu siligiṁchenu
(||śhamiṁ||)
vŏttidim̐ jannula vŏraḍuvāyam̐ga
pŏttigam̐ būvulam̐ būjiṁchenu
lattuga naṁṭina lachchana nŏsala
mĕttenu gaṁdamu mīm̐danĕllā
(||śhamiṁ||)
kūḍidim̐ gām̐giḍa kŏsaru dīram̐ga
vīḍĕmiṁda śhrī veṁkaḍaśha
vāḍiṁchidi movi vannĕlu vuṭṭam̐ga
kūḍa ne nĕṁchenu guṟudulu