Seyyi mumchinavaanigi seppide romta

చెయ్యి ముంచినవానికి చెప్పితే రోఁత
Language

(॥పల్లవి॥)
చెయ్యి ముంచినవానికి చెప్పితే రోఁత
తియ్యని నోరఁ జేఁదు తెగి నంజేనా

(॥॥)
కూర వండి కస వేరఁగూడదు నాకు నయితే
యేరా నిన్నుఁ గూడి యింకా నెగ్గుపట్టేనా
నీరువంక తుంగవంటి నీమనసెందుండినాను
ఆరయఁగ నేనింక నడ్డపెట్టేనా

(॥॥)
గోడఁబూసిన సున్నము కూడపెట్ట నేరనోప
అడుకోలు మాటదప్పెనని యెంచేనా
జీడిపంటిగింజ వంటి చెంగియుండె నీగుణము
కోడెమారకునికత్తికి గురిసేసేనా

(॥॥)
వెన్నచేతఁబట్టి నేయి వెదక నేఁజాలఁగాక
నన్ను నీవు గూడుండఁగ నవ్వకుండేనా
ఇన్నిటాను శ్రీ వేంకటేశ నీకు నాకు నొక్క-
పన్నుగడ దైవ మిచ్చె పచ్చిసేసేనా

(||pallavi||)
sĕyyi muṁchinavānigi sĕppide rom̐ta
tiyyani noram̐ jem̐du tĕgi naṁjenā

(||||)
kūra vaṁḍi kasa veram̐gūḍadu nāgu nayide
yerā ninnum̐ gūḍi yiṁkā nĕggubaṭṭenā
nīruvaṁka tuṁgavaṁṭi nīmanasĕṁduṁḍinānu
ārayam̐ga neniṁka naḍḍabĕṭṭenā

(||||)
goḍam̐būsina sunnamu kūḍabĕṭṭa neranoba
aḍugolu māḍadappĕnani yĕṁchenā
jīḍibaṁṭigiṁja vaṁṭi sĕṁgiyuṁḍĕ nīguṇamu
koḍĕmāragunigattigi gurisesenā

(||||)
vĕnnasedam̐baṭṭi neyi vĕdaga nem̐jālam̐gāga
nannu nīvu gūḍuṁḍam̐ga navvaguṁḍenā
inniḍānu śhrī veṁkaḍeśha nīgu nāgu nŏkka-
pannugaḍa daiva michchĕ pachchisesenā