చెయ్యరాని చేఁతల వో చెన్నకేశ్వరా
(॥పల్లవి॥)
చెయ్యరాని చేఁతల వో చెన్నకేశ్వరా
చేయం(చెయ్యం?)టేవు గండికోట చెన్నకేశ్వరా
(॥చెయ్య॥)
బగ్గన నీవు నాపయ్యద వట్టి తియ్యఁగా
సిగ్గులువడఁగరాదా చెన్నకేశ్వరా
వొగ్గి యెవ్వతోమెట్టెలు వొట్టి నావేలఁ బెట్టఁగ
యెగ్గులువట్టఁగరాదా ఇటు చెన్నకేశ్వరా
(॥చెయ్య॥)
సిరులతో నీవు నన్నుఁ జెనకులు చెనకఁగా
శిరసైన నూఁచరాదా చెన్నకేశ్వరా
తెరలోనఁ బెట్టుకొన్న తెరవను మొక్కించఁగ
వొరిమఁ దిట్టఁగరాదా వో చెన్నకేశ్వరా
(॥చెయ్య॥)
వేవేలుగా మన్నించివేడుకపడఁగా నీకు
సేవలు సేయఁగరాదా చెన్నకేశ్వరా
యీవల శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
తావుకొని మెచ్చరాదా తగుచెన్నకేశ్వరా
(||pallavi||)
sĕyyarāni sem̐tala vo sĕnnageśhvarā
seyaṁ(sĕyyaṁ?)ṭevu gaṁḍigoḍa sĕnnageśhvarā
(||sĕyya||)
baggana nīvu nābayyada vaṭṭi tiyyam̐gā
sigguluvaḍam̐garādā sĕnnageśhvarā
vŏggi yĕvvadomĕṭṭĕlu vŏṭṭi nāvelam̐ bĕṭṭam̐ga
yĕgguluvaṭṭam̐garādā iḍu sĕnnageśhvarā
(||sĕyya||)
sirulado nīvu nannum̐ jĕnagulu sĕnagam̐gā
śhirasaina nūm̐sarādā sĕnnageśhvarā
tĕralonam̐ bĕṭṭugŏnna tĕravanu mŏkkiṁcham̐ga
vŏrimam̐ diṭṭam̐garādā vo sĕnnageśhvarā
(||sĕyya||)
vevelugā manniṁchiveḍugabaḍam̐gā nīgu
sevalu seyam̐garādā sĕnnageśhvarā
yīvala śhrīveṁkaḍeśha iḍu nannu nelidivi
tāvugŏni mĕchcharādā tagusĕnnageśhvarā