చేయివట్టి తియ్యకువో చెనకి వేగిరించకు
(॥పల్లవి॥)
చేయివట్టి తియ్యకువో చెనకి వేగిరించకు
నీ యాధీనమై యిటే నెట్టుక వుందానను
(॥చేయి॥)
దగ్గరి విచ్చేసి నాతలపై సేసలువెట్టి
సిగ్గులెల్ల బాపి మతి చింత దీర్చితి
నిగ్గుల కళలతోడ నిండురాజసముతోడ
సగ్గుడై ముగ్గుజడై యింట్టె సతంసించుదానను
(॥చేయి॥)
కంచపుమోవి యిచ్చికన్నులనే నవ్వునవ్వి
చంచలములెల్లఁ బాపి చనవిచ్చితి
నించిన వేడుకతోడ నీసరసముతోడ
మంచముపై రతులని మలసి వుందానను
(॥చేయి॥)
మచ్చిక నాపై నెరపి మనసెల్ల సోదించి
ముచ్చటల నీవు నాపై మోహించితివి
ఇచ్చకపు శ్రీవేంకటేశ నీకాఁగిటితోడ
నిచ్చలపుటానందాన నెరసి వుందానను
(||pallavi||)
seyivaṭṭi tiyyaguvo sĕnagi vegiriṁchagu
nī yādhīnamai yiḍe nĕṭṭuga vuṁdānanu
(||seyi||)
daggari vichchesi nādalabai sesaluvĕṭṭi
siggulĕlla bābi madi siṁta dīrsidi
niggula kaḽaladoḍa niṁḍurājasamudoḍa
sagguḍai muggujaḍai yiṁṭṭĕ sadaṁsiṁchudānanu
(||seyi||)
kaṁchabumovi yichchigannulane navvunavvi
saṁchalamulĕllam̐ bābi sanavichchidi
niṁchina veḍugadoḍa nīsarasamudoḍa
maṁchamubai radulani malasi vuṁdānanu
(||seyi||)
machchiga nābai nĕrabi manasĕlla sodiṁchi
muchchaḍala nīvu nābai mohiṁchidivi
ichchagabu śhrīveṁkaḍeśha nīgām̐giḍidoḍa
nichchalabuḍānaṁdāna nĕrasi vuṁdānanu