చేయిముట్టి సరసాలు చెల్లవు నేఁడు
(॥పల్లవి॥)
చేయిముట్టి సరసాలు చెల్లవు నేఁడు
ఆయనాయ నిఁకనేల అటువంటిపనులు
(॥చేయి॥)
చేరి నన్ను నంటకురా చెఱఁగుమాసినదాన
ఆరసి మాఁట చెప్పరా అల్లంతనుండి
కోరి నీవేమన్న మాకును నవ్వు రాదురా
ఔరా నీవేమి సేయుమన్నాఁ జేసేను
(॥చేయి॥)
మట్టుమీరి రాకురా మంచముపై నున్నుదాన
యిట్టె నీపంపినవిడె మిదె చాలును
దిట్టి నీజాణతనాలు తెలియవురా మాకు
వెట్టికి నావీనుల వినేఁగాని
(॥చేయి॥)
బలిమి సేయకురా పవళించివున్నదాన
అలరి నీవు నాకు లోనౌటేచాలు
చెలఁగి కూడితి విట్టె శ్రీవేంకటేశుఁడ నన్ను
అలుక లిన్నియుఁ దీరె నట్టె కానీరా
(||pallavi||)
seyimuṭṭi sarasālu sĕllavu nem̐ḍu
āyanāya nim̐kanela aḍuvaṁṭibanulu
(||seyi||)
seri nannu naṁṭagurā sĕṟam̐gumāsinadāna
ārasi mām̐ṭa sĕpparā allaṁtanuṁḍi
kori nīvemanna māgunu navvu rādurā
aurā nīvemi seyumannām̐ jesenu
(||seyi||)
maṭṭumīri rāgurā maṁchamubai nunnudāna
yiṭṭĕ nībaṁpinaviḍĕ midĕ sālunu
diṭṭi nījāṇadanālu tĕliyavurā māgu
vĕṭṭigi nāvīnula vinem̐gāni
(||seyi||)
balimi seyagurā pavaḽiṁchivunnadāna
alari nīvu nāgu lonauḍesālu
sĕlam̐gi kūḍidi viṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍa nannu
aluga linniyum̐ dīrĕ naṭṭĕ kānīrā