చేయి వట్టి తియ్యనేలే చెలులాలా
(॥పల్లవి॥)
చేయి వట్టి తియ్యనేలే చెలులాలా
యీ యెడనే వున్నవాఁడు యేలుకొనీఁ గాక
(॥॥)
సరసమాడెడువాఁడు సంగాతము సేయఁడా
మరిగినవాఁడు నన్ను మన్నించఁడా
వరుసకువచ్చేవాఁడు వలపులు చల్లఁడా
వెరవెఱఁగక యేల వేగిరించేరే
(॥॥)
చనవులిచ్చినవాఁడు సంగడి గూచుండఁడా
మనసెరిఁగినవాడుఁ మాటలాడఁడా
కనుఁగొన్నవాఁడు యిఁకఁ గాఁగిలించుకొనఁ డా
తనివిఁ బొందక యేల తమికించేరే
(॥॥)
కూడిమాడినవాఁడు గుట్టు నాకుఁ జెప్పఁడా
వాడికెక్కినవాఁడు నావసమేకాఁడా
యీడనే శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
జాడదెలియక యెంత సారెఁ బెనఁ గేరే
(||pallavi||)
seyi vaṭṭi tiyyanele sĕlulālā
yī yĕḍane vunnavām̐ḍu yelugŏnīm̐ gāga
(||||)
sarasamāḍĕḍuvām̐ḍu saṁgādamu seyam̐ḍā
mariginavām̐ḍu nannu manniṁcham̐ḍā
varusaguvachchevām̐ḍu valabulu sallam̐ḍā
vĕravĕṟam̐gaga yela vegiriṁchere
(||||)
sanavulichchinavām̐ḍu saṁgaḍi gūsuṁḍam̐ḍā
manasĕrim̐ginavāḍum̐ māḍalāḍam̐ḍā
kanum̐gŏnnavām̐ḍu yim̐kam̐ gām̐giliṁchugŏnam̐ ḍā
tanivim̐ bŏṁdaga yela tamigiṁchere
(||||)
kūḍimāḍinavām̐ḍu guṭṭu nāgum̐ jĕppam̐ḍā
vāḍigĕkkinavām̐ḍu nāvasamegām̐ḍā
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
jāḍadĕliyaga yĕṁta sārĕm̐ bĕnam̐ gere