Seyi vattenamtaa nela seluvunim dittevu

చేయి వట్టెనంటా నేల చెలువునిఁ దిట్టేవు
Language

(॥పల్లవి॥)
చేయి వట్టెనంటా నేల చెలువునిఁ దిట్టేవు
ఆయములు గరఁగఁగా ఆసపడవలదా

(॥చేయి॥)
చిక్కనితేనెలతో నీచిగురాకుమోవి చూచి
వుక్కున నీపతికి నోరూరకుండునా
గక్కన నీమోము చంద్రకళదేరఁగాఁ జూచి
పక్కన నీకు నట్టె బాఁతిపడవలదా

(॥చేయి॥)
పట్టెఁడేసివట్రువనీ బంగారుచన్నులు చూచి
చుట్టి యాతనిచూపులు సోఁకఁదగదా
జట్టిగ నందపునీజఘనచక్రము చూచి
రెట్టించి వలపులు రేఁగఁగవలదా

(॥చేయి॥)
సావధానముల నీచక్కఁదనములు చూచి
యీవేళ శ్రీవేంకటేశుఁ డెనసె నౌనె
తావుల నీకొప్పును బిత్తరిచూపులునుఁ జూచి
యీవులిచ్చి నిన్ను నురమెక్కించుకోవలదా

(||pallavi||)
seyi vaṭṭĕnaṁṭā nela sĕluvunim̐ diṭṭevu
āyamulu garam̐gam̐gā āsabaḍavaladā

(||seyi||)
sikkanidenĕlado nīsigurāgumovi sūsi
vukkuna nībadigi norūraguṁḍunā
gakkana nīmomu saṁdragaḽaderam̐gām̐ jūsi
pakkana nīgu naṭṭĕ bām̐tibaḍavaladā

(||seyi||)
paṭṭĕm̐ḍesivaṭruvanī baṁgārusannulu sūsi
suṭṭi yādanisūbulu som̐kam̐dagadā
jaṭṭiga naṁdabunījaghanasakramu sūsi
rĕṭṭiṁchi valabulu rem̐gam̐gavaladā

(||seyi||)
sāvadhānamula nīsakkam̐danamulu sūsi
yīveḽa śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ naunĕ
tāvula nīgŏppunu bittarisūbulunum̐ jūsi
yīvulichchi ninnu nuramĕkkiṁchugovaladā