Seyave maganiseva sedulaaraanu

సేయవే మగనిసేవ చేతులారాను
Language

(॥పల్లవి॥)
సేయవే మగనిసేవ చేతులారాను
కాయజకేలికి వచ్చి కాయమెంత దాఁచేవు

(॥సేయ॥)
సిగ్గు లింతే సేఁటికే చిరునవ్వు లఁటికే
అగ్గలమై నీతో మాఁట లాతఁ డాడఁగా
వొగ్గి విడె మందుకోవే వొద్దఁ గూచుండఁగదవె
యెగ్గేల చిన్నదానవా యెన్నాళ్ల్తెనాను

(॥సేయ॥)
శిరసు వంచ నేఁటికే చెక్కిట చెయి వెట్టనేలే
బెరసి యాతఁడు నీతోఁ బెనఁగఁగాను
పరిమళాలు వూయవే పాదము లొత్తఁగదవే
పెరిగి పెద్దవై ఇంకాఁ బిన్నదానవా

(॥సేయ॥)
పయ్యదకొంగుమాటేలే పరాకు సేసుకోనేలే
నెయ్యముతో నాతఁడు నిన్నుఁ జూడఁగా
చెయ్యారాఁ గూడిన శ్రీవేంకటేశుఁడేకదే
వుయ్యాల పిన్నదానవా వొదగె నీ చన్నులు

(||pallavi||)
seyave maganiseva sedulārānu
kāyajageligi vachchi kāyamĕṁta dām̐sevu

(||seya||)
siggu liṁte sem̐ṭige sirunavvu lam̐ṭige
aggalamai nīdo mām̐ṭa lādam̐ ḍāḍam̐gā
vŏggi viḍĕ maṁdugove vŏddam̐ gūsuṁḍam̐gadavĕ
yĕggela sinnadānavā yĕnnāḽldĕnānu

(||seya||)
śhirasu vaṁcha nem̐ṭige sĕkkiḍa sĕyi vĕṭṭanele
bĕrasi yādam̐ḍu nīdom̐ bĕnam̐gam̐gānu
parimaḽālu vūyave pādamu lŏttam̐gadave
pĕrigi pĕddavai iṁkām̐ binnadānavā

(||seya||)
payyadagŏṁgumāḍele parāgu sesugonele
nĕyyamudo nādam̐ḍu ninnum̐ jūḍam̐gā
sĕyyārām̐ gūḍina śhrīveṁkaḍeśhum̐ḍegade
vuyyāla pinnadānavā vŏdagĕ nī sannulu