సేయవయ్యా చేయఁగల చేఁతలెల్లాను
(॥పల్లవి॥)
సేయవయ్యా చేయఁగల చేఁతలెల్లాను
నీ యంత లేనితగవు నేరుపఁగ వచ్చునా
(॥సేయ॥)
తలఁపులు రూపించి ముందరఁబెట్టవచ్చునా
వలపు లంగడిఁబెట్టవచ్చునా తెచ్చి
పలుకులు మూటగట్టి బండారించవచ్చునా
చలమరి నీగుణాలు చక్కఁబెట్టవచ్చునా
(॥సేయ॥)
పట్టరానివయసున బయలీఁదవచ్చునా
వట్టినవ్వులెల్లా నానఁబెట్టవచ్చునా
కట్టఁగడ వావులెల్లా గాదెఁ బోయవచ్చునా
దట్టమైననీయాసలు తలఁగించవచ్చునా
(॥సేయ॥)
వుడివోనినీబాసలు వొడిఁబెట్టవచ్చునా
చిడుముడి నీరతులు చెప్పవచ్చునా
అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగనేను
యడయక నన్నేలితి విఁక దూరవచ్చునా
(||pallavi||)
seyavayyā seyam̐gala sem̐talĕllānu
nī yaṁta lenidagavu nerubam̐ga vachchunā
(||seya||)
talam̐pulu rūbiṁchi muṁdaram̐bĕṭṭavachchunā
valabu laṁgaḍim̐bĕṭṭavachchunā tĕchchi
palugulu mūḍagaṭṭi baṁḍāriṁchavachchunā
salamari nīguṇālu sakkam̐bĕṭṭavachchunā
(||seya||)
paṭṭarānivayasuna bayalīm̐davachchunā
vaṭṭinavvulĕllā nānam̐bĕṭṭavachchunā
kaṭṭam̐gaḍa vāvulĕllā gādĕm̐ boyavachchunā
daṭṭamainanīyāsalu talam̐giṁchavachchunā
(||seya||)
vuḍivoninībāsalu vŏḍim̐bĕṭṭavachchunā
siḍumuḍi nīradulu sĕppavachchunā
aḍari śhrīveṁkaḍeśha alamelumaṁganenu
yaḍayaga nannelidi vim̐ka dūravachchunā