Seyavayyaa imkaa neegum jellinatlellaa

సేయవయ్యా ఇంకా నీకుఁ జెల్లినట్లెల్లా
Language

(॥పల్లవి॥)
సేయవయ్యా ఇంకా నీకుఁ జెల్లినట్లెల్లా
యీ యెడమేలనుచు నిన్నిట్టే మెచ్చేమయ్యా

(॥సేయ॥)
మారుమాటలాడక మనసు సోదించక
చేరి నీ చెప్పినట్టెల్లాఁ జేసేమయ్యా
సారెఁ గొసరక చలము సాదించక
వూరకే చేతులు మూసుకుండేమయ్యా

(॥సేయ॥)
యెగ్గులేమీఁ బట్టక యెకసక్కేలాడక
వొగ్గుచుఁ జేతులఁ బాదాలొత్తేమయ్యా
శిగ్గులునుఁ బడక శిరసు వంచుకొనక
అగ్గమై నీవు నవ్వినట్టే నవ్వేమయ్యా

(॥సేయ॥)
తప్పులేమీ నెంచక తగవులఁ బెట్టక
ముప్పిరి సరసములు ముంచేమయ్యా
యిప్పుడె శ్రీ వేంకటేశ యెనసితివిటు నన్ను
తప్పకుండ వేవేలు దండాలు వెట్టేమయ్యా

(||pallavi||)
seyavayyā iṁkā nīgum̐ jĕllinaṭlĕllā
yī yĕḍamelanusu ninniṭṭe mĕchchemayyā

(||seya||)
mārumāḍalāḍaga manasu sodiṁchaga
seri nī sĕppinaṭṭĕllām̐ jesemayyā
sārĕm̐ gŏsaraga salamu sādiṁchaga
vūrage sedulu mūsuguṁḍemayyā

(||seya||)
yĕggulemīm̐ baṭṭaga yĕgasakkelāḍaga
vŏggusum̐ jedulam̐ bādālŏttemayyā
śhiggulunum̐ baḍaga śhirasu vaṁchugŏnaga
aggamai nīvu navvinaṭṭe navvemayyā

(||seya||)
tappulemī nĕṁchaga tagavulam̐ bĕṭṭaga
muppiri sarasamulu muṁchemayyā
yippuḍĕ śhrī veṁkaḍeśha yĕnasidiviḍu nannu
tappaguṁḍa vevelu daṁḍālu vĕṭṭemayyā