Seyavayya neevu sese semta lellaanu maa

సేయవయ్య నీవు సేసే చేఁత లెల్లాను మా
Language

(॥పల్లవి॥)
సేయవయ్య నీవు సేసే చేఁత లెల్లాను మా-
పాయపు వయసే పో భ్రమయించేది

(॥సేయ॥)
పక్కున నీవు మాతో బలిమి చూపిన మా-
జక్కవకుచములేపో సాదించేవి
చక్కఁగా నీవెంతేసి సాములు సేసి వచ్చినా
వెక్కసపుమాఁటలే పో వేటువేసేవి

(॥సేయ॥)
చెలరేఁగి నీవు మాపై చేతు లెంత చాఁచినాను
సొలపుఁజూపులేపో సూడువట్టేవి
తొలఁగక సరసాన దొమ్మి యెంతసేసినా మా-
మొలకనవ్వులేపో ముంచుకొనేవి

(॥సేయ॥)
చిత్తగించి కాఁగిటను చేపట్టులకుఁ జొచ్చితే
తత్తరపు సిగ్గులే పంతము గోనేవి
యిత్తల శ్రీవేంకటేశ యెనసితి విట్లానే
లత్తుక గోరివన్నెలే లావుచూపేవి

(||pallavi||)
seyavayya nīvu sese sem̐ta lĕllānu mā-
pāyabu vayase po bhramayiṁchedi

(||seya||)
pakkuna nīvu mādo balimi sūbina mā-
jakkavagusamulebo sādiṁchevi
sakkam̐gā nīvĕṁtesi sāmulu sesi vachchinā
vĕkkasabumām̐ṭale po veḍuvesevi

(||seya||)
sĕlarem̐gi nīvu mābai sedu lĕṁta sām̐sinānu
sŏlabum̐jūbulebo sūḍuvaṭṭevi
tŏlam̐gaga sarasāna dŏmmi yĕṁtasesinā mā-
mŏlaganavvulebo muṁchugŏnevi

(||seya||)
sittagiṁchi kām̐giḍanu sebaṭṭulagum̐ jŏchchide
tattarabu siggule paṁtamu gonevi
yittala śhrīveṁkaḍeśha yĕnasidi viṭlāne
lattuga gorivannĕle lāvusūbevi